
ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ).. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 2,623 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్, ల్యాబ్ కెమిస్ట్, అనలిస్ట్, పెట్రోలియం ప్రొడక్ట్స్, డిసిల్ మెకానిక్, సెక్రటేరియల్ అసిస్టెంట్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, సివిల్ ఎగ్జిక్యూటివ్, పెట్రోలియం ఎగ్జిక్యూటివ్.. విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
ఈ పోస్టును దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతితోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 2025 నవంబర్ 6వ తేదీ నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు చొప్పున వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు నవంబర్ 6, 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్షలేకుండానే విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు రూ.9,600 నుంచి రూ.10,560 వరకు, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు రూ.10,900, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు రూ.12,300 చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.