Group – 1: ప్రిలిమ్స్‌ కు పకడ్బందీ ఏర్పాట్లు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ.. వీటికి మాత్రమే అనుమతి..

నిరుద్యోగులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఆదివారం జరగనుంది. రేపు జరగబోయే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఎగ్జామ్‌ కోసం తెలంగాణ ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. అయితే.. ఎగ్జామ్ సమయంలో..

Group - 1: ప్రిలిమ్స్‌ కు పకడ్బందీ ఏర్పాట్లు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ.. వీటికి మాత్రమే అనుమతి..
Tspsc

Updated on: Oct 15, 2022 | 6:51 AM

నిరుద్యోగులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఆదివారం జరగనుంది. రేపు జరగబోయే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఎగ్జామ్‌ కోసం తెలంగాణ ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. అయితే.. ఎగ్జామ్ సమయంలో అభ్యర్ధులు పాటించాల్సిన రూల్స్‌ ఏంటి? అధికారులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆదివారం ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. ఉదయం ఎనిమిదిన్నర నుంచే ఎగ్జామ్ హాల్‌లోకి అభ్యర్ధులను అనుమతిస్తారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు చెబుతున్నారు. పరీక్ష ప్రారంభమయ్యే పదిహేను నిమిషాల ముందే గేట్లు మూసేస్తామని చెబుతున్నారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కి హాజరయ్యే అభ్యర్ధులు కచ్చితంగా నిబంధనలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. హాల్‌ టికెట్‌తోపాటు ఏదైనా ఐడీ కార్డ్‌, పెన్‌, పెన్సిల్‌ను మాత్రమే అనుమతిస్తామని చెబుతున్నారు. షూస్‌ అండ్ వాచ్‌ ధరించి రావొద్దని సూచిస్తున్నారు. అభ్యర్ధులకు ఏమైనా డౌట్స్‌ ఉంటే, ఆయా జిల్లాల్లో ఏర్పాటుచేసిన హెల్ప్‌ సెంటర్స్‌కి ముందే కాల్‌చేసి తెలుసుకోవాలంటున్నారు అధికారులు. ఎవరైనా మాల్‌ ప్రాక్టీస్‌కి పాల్పడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఇక పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్‌ అమలు చేస్తోన్న పోలీసులు, ఎగ్జామ్‌ సెంటర్‌కు వంద మీటర్ల వరకు ఇతరులను అనుమతించబోమని ప్రకటించారు. మొత్తం 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఆదివారం ప్రిలిమ్స్‌ జరగనుంది. సుమారు ఐదు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దాంతో, గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అయితే, గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షపై సందిగ్ధత కొనసాగుతూ వచ్చింది. కొందరు అభ్యర్ధులు హైకోర్టుకెళ్లడంతో ఎగ్జామ్‌ వాయిదా పడుతుందని ప్రచారం జరిగింది.

ఇవి కూడా చదవండి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్‌ 16న నిర్వహించనున్న టీఎస్పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమినరీ రాత పరీక్ష నిలిపివేతకు హైకోర్టు నిరాకరించింది. ఐతే ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు మాత్రం కోర్టు తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఎస్టీ రిజర్వేషన్‌ అమలుపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని టీఎస్‌పీఎస్సీతోపాటు, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఈ సందర్భంగా నోటీసులు జారీ చేసింది.