NVS Non-Teaching posts 2022: నవోదయ నాన్‌టీచింగ్ పోస్టులకు హాల్‌ టికెట్లు విడుదల.. పరీక్ష తేదీలివే..

|

Feb 26, 2022 | 8:45 PM

నవోదయ విద్యాలయ సమితి (NVS) వివిధ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పరీక్షకు అడ్మిట్ కార్డులను విడుదల చేసింది..

NVS Non-Teaching posts 2022: నవోదయ నాన్‌టీచింగ్ పోస్టులకు హాల్‌ టికెట్లు విడుదల.. పరీక్ష తేదీలివే..
Nvs Admit Cards
Follow us on

NVS Non-Teaching Admit Card 2022: నవోదయ విద్యాలయ సమితి (NVS) వివిధ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పరీక్షకు అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.inలో చెక్‌ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 1900 పైగా నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ కమిషనర్ (గ్రూప్-A), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మహిళా స్టాఫ్ నర్స్, స్టెనోగ్రాఫర్ (గ్రూప్ C), అనేక ఇతర ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ, డిప్లొమా, మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులు ఈ పోస్టులకు అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ జనవరి 12 నుంచి ఫిబ్రవరి 10 కొనసాగింది. ఇక ఈ పోస్టులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన పరీక్ష మార్చి 9 నుంచి మార్చి 11 వరకు నిర్వహించబడుతుంది.

అడ్మిట్ కార్డులను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.inను ఓపెన్‌ చెయ్యాలి.
  • హోమ్‌పేజ్‌లో కనిపించే ‘Link for downloading an E-admit card’ అనే లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
  • సంబంధిత వివరాలతో లాగిన్‌ అవ్వాలి.
  • వెంటనే స్క్రీన్‌పై అడ్మిట్ కార్డ్ ఓపెన్ అవుతుంది.
  • డౌన్‌లోడ్‌ చేసుకుని, ప్రింట్ ఔట్‌ తీసుకోవాలి.

Also Read:

ICAI CA Intermediate Results: ఐసీఏఐ సీఏ 2021 ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదల.. ఎలా చెక్‌ చేసుకోవాలంటే..