RRB NTPC Railway Exam 2025: మరోవారంలో ఎన్టీపీసీ రైల్వే రాత పరీక్షలు.. అడ్మిట్ కార్డులు విడుదల ఎప్పుడంటే?

, NTPC UG CBT 2 City Intimation Slips Download: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌ (RRB) ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ అండర్‌ గ్రాడ్యుయేట్ ఆన్‌లైన్ రాత పరీక్షలను మరో వారంలో నిర్వహించనుంది. ఈ క్రమంలో ఈ పరీక్షలకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లను తాజాగా విడుదల చేసింది. ఇప్పటికే సీబీటీ 1 పరీక్ష పూర్తి కాగా ఇందులో అర్హత సాధించిన వారికి..

RRB NTPC Railway Exam 2025: మరోవారంలో ఎన్టీపీసీ రైల్వే రాత పరీక్షలు.. అడ్మిట్ కార్డులు విడుదల ఎప్పుడంటే?
RRB NTPC UG CBT 2 Railway Exam

Updated on: Dec 11, 2025 | 3:25 PM

హైదరాబాద్‌, డిసెంబర్‌ 11: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌ (RRB) ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ అండర్‌ గ్రాడ్యుయేట్ ఆన్‌లైన్ రాత పరీక్షలను మరో వారంలో నిర్వహించనుంది. ఈ క్రమంలో ఈ పరీక్షలకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లను తాజాగా విడుదల చేసింది. ఇప్పటికే సీబీటీ 1 పరీక్ష పూర్తి కాగా ఇందులో అర్హత సాధించిన వారికి సీబీటీ 2 పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 20వ తేదీన నిర్వహించనుంది. సీబీటీ 2 పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను డౌన్‌లోడ్‌ చేసుకోవచచు. ఇక పరీక్షల అడ్మిట్‌ కార్డులను పరీక్షకు సరిగ్గా నాలుగు రోజుల ముందు ఆర్‌ఆర్‌బీ విడుదల చేయనుంది. కాగా డిసెంబర్ 20న మొత్తం 51,978 మంది అభ్యర్థులు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో పరీక్షకు హాజరుకానున్నారు. ఇతర వివరాలు ఈ కింది అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఆర్‌ఆర్‌బీ రీజినల్ వెబ్‌సైట్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఎన్టీపీసీ సీబీటీ 2 సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఐబీపీఎస్‌ ఎస్‌ఓ, పీఓ ఫలితాలు వచ్చేశాయ్‌.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్‌ (IBPS) ఈ ఏడాది నవంబర్‌ 9వ తేదీన నిర్వహించిన స్పెషలిస్ట్ ఆఫీసర్స్‌ (SO), ప్రొబేషనరీ ఆఫీసర్‌ (PO) మెయిన్స్‌ 2025 పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లోhttps://www.ibps.in/ పొందుపరిచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌, రోల్ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ఫలితాలను పొందవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1007 ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

ఐబీపీఎస్‌ పీఓ మెయిన్స్‌ స్కోర్‌ కార్డుల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.