ICAR AIEEA 2025 Notification: అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల..

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 74 వ్యవసాయ వర్సిటీల్లో పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌- ఆలిండియా ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ ఫర్‌ అడ్మిషన్‌ (ఐకార్‌- ఏఐఈఈఏ పీజీ 2025) నోటిపికేషన్ విడుదలైంది..

ICAR AIEEA 2025 Notification: అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల..
ICAR AIEEA 2025 Admissions

Updated on: May 07, 2025 | 3:40 PM

దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 74 వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ సంబంధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌- ఆలిండియా ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ ఫర్‌ అడ్మిషన్‌ (ఐకార్‌- ఏఐఈఈఏ పీజీ 2025), ఆలిండియా కాంపిటేటివ్‌ ఎగ్జామినేషన్‌ ఫర్‌ అడ్మిషన్‌ టు డాక్టోరల్‌ డిగ్రీ ప్రోగ్రామ్స్‌ అండ్‌ అవార్డ్‌ జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ) 2025 అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పరీక్ష నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న 74 అగ్రికల్చర్‌ యూనివర్సిటీల్లో పలు కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఆన్‌లైన్ విధానంలో మే 6 నుంచి జూన్‌ 5 వరకు దరఖాస్తు చేసుకోవాలి. జూన్‌ 3న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధానంలో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 2 గంటల వ్యవధిలో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు సమాచాధానాలు రాయవల్సి ఉంటుంది. ఇతర వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 5, 2025.
  • ఫీజు చెల్లింపులకు చివరి తేదీ: జూన్‌ 5, 2025.
  • అప్లికేషన్‌ కరెక్షన్‌ విండో తేదీలు: జూన్ 7 నుంచి జూన్ 9 వరకు
  • పరీక్ష తేదీ: జులై 3, 2025.

ఐకార్‌- ఏఐఈఈఏ (పీజీ), ఏఐసీఈ జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌(పీహెచ్‌డీ)-2025 నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మే 13 నుంచి సీయూఈటీ (యూజీ) పరీక్షలు ప్రారంభం.. వెబ్‌సైట్‌లో సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు

కామన్‌ యూనివర్సిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (యూజీ) 2025 సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను ఎన్‌టీఏ విడుదల చేసింది. ఇందులో పరీక్ష కేంద్రాలకు సంబంధించిన వివరాలను పొందుపరిచినట్లు వెబ్‌సైట్‌లో పేర్కొంది. అభ్యర్థులు తమ పుట్టిన తేదీ, అప్లికేషన్‌ నంబర్‌ నమోదు చేసి స్లిప్పులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మే 13వ తేదీ నుంచి జూన్‌ 3 వరకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ప్రవేశ పరీక్షలు నిర్వించనుంది. పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.