NPCC Limited: నెలకు రూ.1,60,000ల జీతంతో రాత పరీక్షలేకుండా ఎన్‌పీసీసీలో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు..

హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌కు చెందిన నేషనల్‌ ప్రాజెక్ట్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌పీసీసీ).. 20 మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌ (ఫైనాన్స్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ..

NPCC Limited: నెలకు రూ.1,60,000ల జీతంతో రాత పరీక్షలేకుండా ఎన్‌పీసీసీలో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు..
NPCC Limited

Updated on: Dec 14, 2022 | 7:35 AM

హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌కు చెందిన నేషనల్‌ ప్రాజెక్ట్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌పీసీసీ).. 20 మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌ (ఫైనాన్స్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా సీఏ/సీఎమ్‌ఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కనీసం 3 నుంచి 8 ఏళ్లపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు నవంబర్‌ 30, 2022వ తేదీనాటికి 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్‌ విధానంలో నోటిఫికేషన్‌ విడుదలైన 30 రోజుల్లోపు (జనవరి 10, 2023) కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా అప్లికేషన్లు పంపించాలి. దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా రూ.1000లు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.40,000ల నుంచి రూ.1,60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్..

General Manager (HR), NPCC Limited, Corporate Office, Plot No. 148, Sector-44, Gurugram – 122003. (Haryana), Tel. Ph. No. 0124-2385223.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.