NPC Executive Recruitment 2022: భారత ప్రభుత్వ కామర్స్, పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ (NPC).. ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి (Executive Posts) అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 39
పోస్టుల వివరాలు: సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ ఎగ్జిక్యూటివ్, లీగల్ ఎగ్జిక్యూటివ్, ఎన్సల్టెంట్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ తదితర పోస్టులు
పే స్కేల్: నెలకు రూ.25,000ల నుంచి రూ.65,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్, ఐటీఐ, గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్/ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ మెయిల్ ఐడీ: ed-admin@npcindia.gov.in
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 26, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: