
Railway Recruitment 2021: నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు పలు సంస్థలు అవకాశాలు కల్పిస్తోంది. ఇప్పటికే చాలా రంగాల్లో నిరుద్యోగులకు ఉద్యోగ అకాశాల కోసం నోటిఫికేషన్‌లు జారీ చేశాయి. తాజాగా నార్త్ సెంట్రల్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. పలు అప్పంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సంస్థ నుంచి నోటిఫికేషన్ జారీ అయింది. అర్హత, ఆసక్తిల అభ్యర్థులు సూచించి ఏప్రిల్ 16లోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 480 ఖాళీలను భర్తీ చేయనుంది.
ఫిట్టర్ విభాగంలో 286 పోస్టులు
వెల్డర్-11 పోస్టులు
మెకానిక్-84 పోస్టులు
కార్పెంటర్-11 పోస్టులు
ఎలక్ట్రీషియన్-88 పోస్టులు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతిలో పాసై ఉండాలి. దీంతో పాటు ఎన్‌సీవీటీకి అనుబంధం పొందిన సంస్థ నుంచి ఐటీఐ సర్టిఫికేట్ పొంది ఉండాలి. అయితే ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం ఉపకార వేతనం అందిస్తారు. దరఖాస్తు చేసుకునే వారి వయసు 15-24 ఏళ్ల మధ్య ఉండాల్సి ఉంటుంది.
అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్ 16వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. అభ్యర్థులు https://www.mponline.gov.in/ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకుని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తును పూర్తి చేసిన అనంతరం ప్రింట్ తీసుకుంటే బాగుంటుంది. అయితే అప్లికేషన్ ప్రక్రియ ఈ రోజుతో ప్రారంభం అవుతుంది. దరఖాస్తు చేసుకునే సమయంలో జనరల్ అభ్యర్థులు రూ.170ని పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు
అధికారిక వెబ్ సైట్: https://ncr.indianrailways.gov.in/
ఇవీ చదవండి: FCI Recruitment 2021: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఇవాళే చివరి తేదీ.. అప్లై చేశారా?
రైల్వే ప్రయాణికులు అలర్ట్.. ఇకనుంచి రైళ్లలో మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ కుదరదు..! ఎందుకో తెలుసా..?