NIT Rourkela Faculty Recruitment 2022: భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఒరిస్సాలోని రూర్కెలా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT Rourkela).. వివిధ విభాగాల్లో ఖాళీగానున్న ఫ్యాకల్టీ పోస్టుల (Faculty Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. బయోటెక్నాలజీ అండ్ మెడికల్ ఇంజనీరింగ్, సివిలి ఇంజనీరింగ్, సెరామిక్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎర్త్ అండ్ అట్మాస్పెరిక్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సె్‌స్, ఇండస్ట్రియల్ డిజైన్, లైఫ్ సైన్సెస్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 51
పోస్టుల వివరాలు: టీచింగ్ పోస్టులు
డిపార్ట్‌మెంట్లు: ఇంజనీరింగ్, సైన్స్, హ్యూమన్ అండ్ సోషల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, లైఫ్ సైన్సెస్ తదితర విభాగాలు.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.70,900ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/బీడీఈఎస్/ఎంఈ/ఎంటెక్/ఎండీఈఎస్, పీజీ డిగ్రీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి. అలాగే సంబంధిత స్పెషలేజేషన్‌లో టీచింగ్ అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: అభ్యర్ధులను టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 4, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.