NIT Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో టీచింగ్ పోస్టులు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక.

|

May 26, 2022 | 6:15 AM

NIT Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. పాట్నా క్యాంపస్‌లో ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు...

NIT Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో టీచింగ్ పోస్టులు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక.
Follow us on

NIT Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. పాట్నా క్యాంపస్‌లో ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు, అర్హతలు ఏంటి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 85 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* వీటిలో ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వంటి పోస్టులు ఉన్నాయి.

* సివిల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఆర్కిటెక్చర్‌ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత. టీచింగ్‌/ రిసెర్చ్‌ అనుభవం ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం హార్డ్‌కాపీని ఆఫ్‌లైన్‌ విధానంలో పంపించాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను ది డైరెక్టర్‌, ఎన్ఐటీ పాట్నా, అశోక్‌ రాజ్‌పుత్‌, పాట్నా-800005 అడ్రస్‌కు పంపించాలి.

* అభ్యర్థులను మొదట అకడమిక్‌ అర్హత ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

* 25-05-2022 తేదీన మొదలై దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 10-06-2022తో ముగుస్తుంది. ఇక హార్డ్‌కాపీలను 16-06-2022లోగా పంపించాల్సి ఉంటుంది.

* నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..