NIEPVD Recruitment 2022: బీఈడీ/ఎంఈడీ అర్హతతో ఈ కేంద్ర ప్రభుత్వ దివ్యాంగన్‌ సంస్థలో టీచింగ్‌ ఉద్యోగాలు.. నెల జీతం రూ.60 వేలు..

|

Sep 14, 2022 | 3:37 PM

భారత ప్రభుత్వ సంస్థ అయిన డెహ్రాడూన్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ పర్‌ ది ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ విజువల్‌ డిజబిలిటీస్‌ (NIEPVD).. ఒప్పంద ప్రాతిపదికన 20 లెక్చరర్, ఇన్‌స్ట్రక్టర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ తదితర పోస్టుల (Lecturer Posts) భర్తీకి అర్హులైన..

NIEPVD Recruitment 2022: బీఈడీ/ఎంఈడీ అర్హతతో ఈ కేంద్ర ప్రభుత్వ దివ్యాంగన్‌ సంస్థలో టీచింగ్‌ ఉద్యోగాలు.. నెల జీతం రూ.60 వేలు..
Niepvd Dehradun
Follow us on

NIEPVD Dehradun Teaching Recruitment 2022: భారత ప్రభుత్వ సంస్థ అయిన డెహ్రాడూన్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ పర్‌ ది ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ విజువల్‌ డిజబిలిటీస్‌ (NIEPVD).. ఒప్పంద ప్రాతిపదికన 20 లెక్చరర్, ఇన్‌స్ట్రక్టర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ తదితర పోస్టుల (Lecturer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ/బీఈడీ/డిప్లొమా/ఎంఏ/ఎంఎస్‌డబ్ల్యూ/ఎంఫిల్‌/మాస్టర్స్‌ డిగ్రీ/ఎంఈడీ/ఎండీ/ఐడీ/ఏఎస్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 28 నుంచి 45 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఆఫ్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 29, 2022వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. జనలర్‌ అభ్యర్ధులు రూ.500లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.250లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష/ట్రేడ్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.26,000ల నుంచి రూ.60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్: The Director, NIEPVD, 116 Rajpur Road, Dehradun 248 001.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.