Teacher Jobs: ప్రొఫెసర్‌ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? ఐతే మీకోసమే..

|

Feb 02, 2022 | 8:56 AM

భారత ప్రభుత్వ మానవవనరుల అభివృధి మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ప్లానింగ్‌ అండ్‌ అడ్మినిష్ట్రేషన్‌ (NIEPA - Delhi) ప్రొఫెసర్‌ పోస్టుల (Professor posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

Teacher Jobs: ప్రొఫెసర్‌ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? ఐతే మీకోసమే..
Niepa Delhi
Follow us on

NIEPA – Delhi Recruitment 2022: భారత ప్రభుత్వ మానవవనరుల అభివృధి మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ప్లానింగ్‌ అండ్‌ అడ్మినిష్ట్రేషన్‌ (NIEPA – Delhi) ప్రొఫెసర్‌ పోస్టుల (Professor posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీలు: 3

పోస్టులు: ప్రొఫెసర్‌ ఉద్యోగాలు

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

పే స్కేల్: నెలకి రూ.1,44,000 నుంచి రూ.2,18,200లు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు రూ.500
  • ఓబీసీ/ఇతర అభ్యర్ధులకు రూ.1000

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 16, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Jobs in IIT Roorkee: బీకాం/ఎంకాం అర్హతతో ఐఐటీ రూర్కీలో  ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి..