NIELIT Recruitment 2022: నెలకు రూ.2,16,600ల జీతంతో నీలిట్‌లో సైంటిస్ట్‌ ఉద్యోగాలు.. బీటెక్‌ చదివినవారు అర్హులు!

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (NIELIT).. సైంటిస్ట్‌ పోస్టుల (Scientist Posts) భర్తీకి అర్హులైన..

NIELIT Recruitment 2022: నెలకు రూ.2,16,600ల జీతంతో నీలిట్‌లో సైంటిస్ట్‌ ఉద్యోగాలు.. బీటెక్‌ చదివినవారు అర్హులు!
Nielit

Updated on: May 10, 2022 | 1:18 PM

NIELIT Scientist Recruitment 2022: భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (NIELIT).. సైంటిస్ట్‌ పోస్టుల (Scientist Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 6

పోస్టుల వివరాలు: సైంటిస్ట్‌ ఈ, సైంటిస్ట్‌ ఎఫ్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.1,31,100 నుంచి రూ.2,16,600 వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ మాస్టర్స్‌ డిగ్రీ/ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్ అభ్యర్ధులకు: రూ.800
  • ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు: రూ.400

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 8, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Andhra Pradesh: టెన్త్ పేపర్ లీక్ కేసులో విస్తుపోయే నిజాలు! నారాయణ విద్యార్ధులకు ర్యాంకులు రావాలనే దురుద్ధేశ్యంతో బరితెగింపు..