NHAI: నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో మేనేజర్‌ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు..

న్యూఢిల్లీలోని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా.. డిప్యుటేషన్‌ ప్రాతిపదికన 18 మేనేజర్‌ (అడ్మినిస్ట్రేషన్‌/లీగల్‌), అసిస్టెంట్‌ మేనేజర్‌ (లీగల్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

NHAI: నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో మేనేజర్‌ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు..
National Highways Authority of India

Updated on: Dec 11, 2022 | 6:39 PM

న్యూఢిల్లీలోని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా.. డిప్యుటేషన్‌ ప్రాతిపదికన 18 మేనేజర్‌ (అడ్మినిస్ట్రేషన్‌/లీగల్‌), అసిస్టెంట్‌ మేనేజర్‌ (లీగల్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ, పీజీ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో సెంట్రల్/స్టేట్‌/యూనియన్‌ టెరిటరీ/యూనివర్సిటీ/ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో పని చేసిన అనుభవం ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 56 యేళ్లకు మించకుండా ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 19, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం నింపిన దరఖాస్తులను కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా జవవరి 21లోపు పంపించాలి. విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.15,600ల నుంచి రూ.39,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌ చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్‌..

DGM (HR &Admn.)-IB,
National Highways Authority of India,
Plot No: G – 5 & 6, Sector – 10,
Dwarka, New Delhi – 110075.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.