NEIGRIHMS Recruitment 2022: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ ఇందిరాగాంధీ రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ (NEIGRIHMS) సీనియర్ రెసిడెంట్ డాక్టర్ (senior resident doctor Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 54
ఖాళీల వివరాలు: సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు
విభాగాలు: అనస్టీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫోరెన్సిక్ మెడిసిన్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, న్యూరాలజీ, ఆప్తమాలజీ, పీడియాట్రిక్స్, ఫార్మాకాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.67,700లు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం కూడా ఉండాలి. ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ తేదీ: మార్చి 23, 24, 25, 26 తేదీల్లో ఇంటర్వ్యూలు జరుగుతాయి.
అడ్రస్: కాన్పరెన్స్ హాల్, నైగ్రిమ్స్ గెస్ట్ హౌస్, మాదియాంగ్దియాంగ్, షిల్లాంగ్.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: