
హైదరాబాద్, జులై 17: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసిన రాష్ట్రాల వారీ టాపర్ల జాబితాను గమనిస్తే పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు హెలెట్‌గా నిలిచారు. పంజాబ్‌కు చెందిన ఆర్యన్ గుప్తా 720 మార్కులతో 99.9999 పర్సంటైల్‌తో ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) 1 సాధించగా, హర్యానాకు చెందిన పన్షుల్ బన్సల్ 715 మార్కులతో అదే పర్సంటైల్‌తో రెండవ స్థానంలో నిలిచారు. రాజస్థాన్‌కు చెందిన ఉపలక్ష్య గోయల్ ఏఐఆర్ 3, బీహార్‌కు చెందిన ఆయుష్ భలోటియా (AIR 4), మహారాష్ట్రకు చెందిన శ్రావణి కుడాలే (AIR 5), బీహార్‌కు చెందిన రియా రంజన్ (AIR 6), ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆర్యన్ దూబే (AIR 7) తర్వాతి స్థానాల్లో నిలిచారు.
మొదటి 100 ర్యాంకులను విశ్లేషిస్తే.. రాజస్థాన్ సుమారు 12 మంది అభ్యర్థులతో అత్యధిక స్కోర్ సాధించింది. ఆ తర్వాత మహారాష్ట్రలో 11 మంది ఉన్నారు. పంజాబ్, ఢిల్లీ చెరో ఎనిమిది మంది అభ్యర్థులను అందించగా, తమిళనాడు ఏడుగురు, గుజరాత్, కర్ణాటక చెరో ఆరుగురు అభ్యర్థులను అందించాయి. హర్యానా, తెలంగాణ రాష్ట్రాలు కూడా టాప్ 100లో పలువురు ర్యాంకులు సాధించారు. తాజా నీట్ ఫలితాల్లో అమ్మాయిలు అగ్రశ్రేణి ర్యాంకులలో ప్రముఖంగా నిలిచారు. శ్రావణి కుడాలే AIR 5 (మహారాష్ట్ర), రియా రంజన్ (బీహార్) AIR 6 ర్యాంకులు సాధించారు. టాప్ 50లో మన్షా గార్గ్ (హర్యానా), వైష్ణవి దాస్ (కర్ణాటక), కష్వి ధాల్ (ఢిల్లీ), నమల ప్రేరణ (ఆంధ్రప్రదేశ్), ఆషి గోయల్ (పంజాబ్) ఉన్నారు. రాష్ట్రాల అగ్రగాముల జాబితాలో ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గోవా, జమ్మూ & కాశ్మీర్, లడఖ్, లక్షద్వీప్, మహారాష్ట్ర, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్ తదితర పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అమ్మాయిలు సత్తా చాటారు. లక్షద్వీప్, లడఖ్, అండమాన్, నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, నాగాలాండ్ వంటి చిన్న ప్రాంతాల అభ్యర్థులతో సహా మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి టాపర్లుగా నిలిచారు. ఆ జాబితాను NTA విడుదల చేసింది.
జూన్ 21న జరిగిన నీట్ యూజీ 2026 రీ-టెస్ట్ తర్వాత నిర్వహించిన ఈ పరీక్షలో 11.21 లక్షలకు పైగా అభ్యర్థులు అండర్ గ్రాడ్యుయేట్ వైద్య ప్రవేశాలకు అర్హత సాధించారు.