NEET UG 2026 రీ-ఎగ్జామ్ రేపే.. నేడు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్, అభ్యర్థులకు NTA కీలక సూచనలు

NEET UG 2026 రీ-ఎగ్జామినేషన్‌కు ముందు NTA దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తోంది. జూన్ 21న జరిగే పరీక్షకు సంబంధించి గేట్ల మూసివేత సమయం, అడ్మిట్ కార్డ్ అప్‌డేట్, ప్రత్యేక రైళ్లు, మెట్రో సేవలు సహా అభ్యర్థులు తప్పక తెలుసుకోవాల్సిన కీలక వివరాలను NTA వెల్లడించింది.

NEET UG 2026 రీ-ఎగ్జామ్ రేపే.. నేడు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్, అభ్యర్థులకు NTA కీలక సూచనలు
Neet Re Exam 2026

Updated on: Jun 20, 2026 | 11:09 AM

NEET UG 2026 రీ-ఎగ్జామినేషన్‌ను పారదర్శకంగా, సురక్షితంగా నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) శనివారం (నేడు) దేశవ్యాప్తంగా ప్రత్యేక మాక్ డ్రిల్ నిర్వహిస్తోంది. పరీక్షా కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు, అభ్యర్థుల ప్రవేశ ప్రక్రియ, పరీక్ష నిర్వహణ వ్యవస్థలను పరీక్షించేందుకు ఈ డ్రిల్ చేపడుతోంది.

NTA విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకారం, NEET (UG) 2026 రీ-ఎగ్జామినేషన్ జూన్ 21, ఆదివారం మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పెన్-అండ్-పేపర్ విధానంలో జరుగుతుంది. వికలాంగుల (PwD/PwBD) కేటగిరీకి చెందిన అభ్యర్థులకు అదనపు సమయం కల్పించబడగా, వారు సాయంత్రం 6:20 గంటల వరకు పరీక్ష రాయడానికి అనుమతిస్తారు.

దేశంలోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో నిర్వహించే ఈ పరీక్షకు సుమారు 22.79 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.

ఇవి కూడా చదవండి

ఎగ్జామ్ సెంటర్‌కు ఎప్పుడు చేరుకోవాలి?

అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాలకు ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల మధ్య చేరుకోవాలని NTA సూచించింది.

  • మధ్యాహ్నం 1:30 గంటలకు గేట్లు మూసివేస్తారు.
  • ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశం ఉండదు.
  • మతపరమైన లేదా సంప్రదాయ దుస్తులు ధరించే వారు, ఫుల్ స్లీవ్స్ లేదా ఉన్ని దుస్తులు వేసుకునే వారు ముందుగానే రావాలని సూచించారు.
  • అడ్మిట్ కార్డులో ఉన్న కేంద్రం చిరునామాను తప్పనిసరిగా ధృవీకరించుకోవాలి.
  • కొన్ని కేంద్రాల విషయంలో మ్యాప్ యాప్‌లు తప్పుదారి పట్టించే అవకాశం ఉన్నందున వాటిపైనే పూర్తిగా ఆధారపడవద్దని హెచ్చరించింది.

NEET అభ్యర్థుల కోసం ప్రత్యేక రైళ్లు, మెట్రో సేవలు

  • పరీక్ష రాసే విద్యార్థుల సౌకర్యార్థం దక్షిణ తూర్పు రైల్వే (South Eastern Railway) ప్రత్యేక రైలును నడపనుంది.
  • స్పెషల్ ట్రైన్ నంబర్ 68044: రూర్కెలా నుంచి ఉదయం 5:10 గంటలకు బయలుదేరి.. టాటానగర్‌కు ఉదయం 9:20 గంటలకు చేరుకుంటుంది.
  • ఇక కోల్‌కతా మెట్రో కూడా జూన్ 21న సాధారణ సమయానికి దాదాపు ఐదు గంటల ముందుగానే, అంటే ఉదయం 4 గంటల నుంచే మూడు కారిడార్లలో సేవలు ప్రారంభించనుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలతో పాటు NEET అభ్యర్థులు, వారి తల్లిదండ్రుల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది.

అడ్మిట్ కార్డ్‌పై NTA స్పష్టత

NTA సోషల్ మీడియా వేదిక X ద్వారా కీలక ప్రకటన చేసింది.

  • జూన్ 21 NEET UG పరీక్ష కోసం ఇప్పటికే కొత్త అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకున్న విద్యార్థులు మళ్లీ డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు.
  • SMS, Email, WhatsApp ద్వారా పంపుతున్న సందేశాలు ఇంకా కొత్త అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేయని విద్యార్థుల కోసం మాత్రమే.
  • మే 3న జారీ చేసిన పాత అడ్మిట్ కార్డులు చెల్లవు.
  • అనేక మంది అభ్యర్థులకు వారి ప్రాధాన్య నగరాల్లో కొత్త పరీక్షా కేంద్రాలు కేటాయించినందున జూన్ 21 అడ్మిట్ కార్డునే ఉపయోగించాలి.
  • కొత్త అడ్మిట్ కార్డును ఒకసారి డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకుంటే సరిపోతుందని NTA తెలిపింది.

అభ్యర్థులకు ముఖ్య సూచనలు

  • ఉదయం 11 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవడం మంచిది.
  • అడ్మిట్ కార్డ్, ఫోటో ఐడీ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి.
  • 1:30 గంటల తర్వాత ప్రవేశం ఉండదు.
  • పాత అడ్మిట్ కార్డ్ ఉపయోగించరాదు.
  • కేంద్రం చిరునామాను ముందుగానే పరిశీలించుకోవాలి.
  • భద్రతా తనిఖీలకు సహకరించాలి.
Follow Us