AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET UG 2026 Admit Card: మరికాసేపట్లో నీట్ యూజీ అడ్మిట్ కార్డులు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

నీట్ యూజీ (NEET UG) 2026 అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఏప్రిల్ 26న విడుదల చేయనుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. షెడ్యూల్‌ ప్రకారం నీట్ యూజీ 2026 పరీక్ష..

NEET UG 2026 Admit Card: మరికాసేపట్లో నీట్ యూజీ అడ్మిట్ కార్డులు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
NEET UG Admit Card
Srilakshmi C
|

Updated on: Apr 26, 2026 | 6:00 AM

Share

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25: నీట్ యూజీ (NEET UG) 2026 అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఏప్రిల్ 26న విడుదల చేయనుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. షెడ్యూల్‌ ప్రకారం నీట్ యూజీ 2026 పరీక్ష మే 3వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒకే షిఫ్ట్‌లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. దేశ వ్యాప్తంగా 552 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు.

నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నీట్‌ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా పరీక్షా కేంద్రానికి అడ్మిట్ కార్డులను తీసుకెళ్లాలి. దీనితో పాటు ప్రభుత్వం గుర్తించిన ఏదైనా గుర్తింపు కార్డును అంటే ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, పాన్ కార్డ్ మొదలైనవి తప్పనిసరిగా వెంట తీసుకువెళ్లాలి. ఏవైనా సమస్యలు ఎదురైతే అభ్యర్థులు neetug2026@nta.nic.in మెయిల్ ద్వారా ఎన్టీఏను సంప్రదించవచ్చు.

ఇవి కూడా చదవండి

కాగా నీట్‌ యూజీ 2026 ప్రవేశ పరీక్షను పెన్, పేపర్ విధానంలో ఓఎమ్‌ఆర్‌ షీట్‌ ఆధారంగా నిర్వహిస్తారు. ఇందులో 180 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 720 మార్కులు కేటాయిస్తారు. పరీక్ష వ్యవధి 3 గంటలు. సరైన సమాధానానికి 4 మార్కులు ఉంటాయి. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు.

నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us