
అమరావతి, నవంబర్ 7: నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్-సూపర్ స్పెషాలిటీ (NEET SS) 2025 నోటిఫికేషన్‌ను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) తాజాగా విడుదల చేసిన సంగతి తెలసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 5, 2025వ తేదీ నుంచి ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు natboard.edu.in అధికారిక వెబ్‌సైట్ నుంచి నవంబర్ 25, 2025వ తేదీ రాత్రి 11.55 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు ఆన్‌లైన్ దరఖాస్తుల షెడ్యూల్‌ను విడుదల చేసింది.
తాజా నోటీసు ప్రకారం నీట్ ఎస్‌ఎస్ (NEET SS 2025) రాత పరీక్ష డిసెంబర్ 26, 27 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇతర సందేహాల నివృతికి 7996165333కి ఫోన్ చేయవచ్చు. లేదంటే NBEMS హెల్ప్‌లైన్ పోర్టల్‌లోనూ సంప్రదించవచ్చు. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో డీఎం, ఎంసీహెచ్, డీఆర్‌ఎన్‌బీ సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి వీలుకల్పిస్తారు.
నీట్ ఎస్‌ఎస్ 2025 నోటిఫికేషన్, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.