హైదరాబాద్, మార్చి 19: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ – పోస్ట్‌గ్రాడ్యుయేట్ (నీట్ పీజీ) 2025 పరీక్ష తేదీని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎంఎస్) షెడ్యూల్ విడుదల చేసింది. ఈమేరకు మంగళవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తాజా షెడ్యూల్ మేరకు నీట్ పీజీ పరీక్షను జూన్ 15వ తేదీన దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ పరీక్షను రెండు షిఫ్టుల్లో ఉదయం, మధ్యాహ్నం ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు ఎన్టీయే తెలిపింది. మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుంచి 12.30 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3.30 నుంచి 7 గంటల వరకు ఉంటుంది. నీట్ పీజీ పరీక్షలకు సంబంధించి ఇతర ముఖ్యమైన సమాచారం, మరిన్ని వివరాలతో కూడిన పూర్తి షెడ్యూల్‌ను ‘ఎన్‌బీఈఎంఎస్’ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్టు అధికారులు తెలిపారు.
నీట్ పీజీ 2025 పరీక షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అలాగే యూజీ వైద్య విద్యార్ధులందరూ జూలై 31లోగా ఇంటర్న్‌షిప్ పూర్తిచేసుకోవాల్సి ఉంటుందని ఎన్‌బీఈఎంఎస్ తెలిపింది. బయోమెట్రిక్ వెరిఫికేషన్, కంప్యూటర్ లాగిన్ ప్రక్రియలను పూర్తిచేసేందుకు అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి షెడ్యూల్ కన్నా ముందే చేరుకోవాల్సి ఉంటుందని సూచించింది. నీట్ పీజీ 2025 పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా పీజీ వైద్య కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో ఎంఎస్ కోర్సులో 12,690 సీట్లు, ఎండీ కోర్సులోని 24,360 సీట్లు, పీజీ డిప్లొమా కోర్సులోని 922 సీట్ల చొప్పున అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.