NEET MDS Result 2022: నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (NBE) మాస్టర్స్ ఆఫ్ డెంటల్ (MDS) ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. నీట్ ఎమ్‌డీఎస్ పరీక్షకి హాజరైన అభ్యర్థులు ఎన్‌బీఈ అధికారిక వెబ్‌సైట్ ని సందర్శించి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఎన్‌బీఈ ఈ ఫలితాల PDFని మెరిట్ జాబితా రూపంలో అందుబాటులో ఉంచింది. పరీక్షలో అవసరమైన కట్-ఆఫ్ పొందిన అభ్యర్థులు ఇప్పుడు నీట్ ఎమ్‌డీఎస్ దరఖాస్తు చేసుకోవచ్చు.
నీట్ ఎమ్‌డీఎస్ 2022 ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి..?
1. అధికారిక వెబ్‌సైట్ లేదా natboard.edu.inని ఓపెన్ చేయాలి.
2. నీట్ ఎమ్‌డీఎస్ ఫలితాల ప్రకటన కోసం లింక్ పేజీ అందుబాటులో ఉంటుంది.
3. అందులో ఉన్న నీట్ ఎమ్‌డీఎస్ 2022 ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.
4. నీట్ ఎమ్‌డీఎస్ ఫలితాల PDF స్క్రీన్‌పై కనిపిస్తుంది.
5. డౌన్‌లోడ్ ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా PDFని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
నీట్ ఎమ్‌డీఎస్ 2022 ఫలితాల ఆధారంగా షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు ఇప్పుడు 50% ఆల్ ఇండియా కోటా సీట్లు, 50% స్టేట్ కోటా సీట్లు, 6,501 MDS సీట్లు.. డీమ్డ్/సెంట్రల్ యూనివర్శిటీలు, ESIC, ప్రైవేట్ యూనివర్శిటీలలో జాయిన్ అయ్యే ఆశకాశాలు ఉంటాయి. నీట్ ఎమ్‌డీఎస్ పరీక్ష 2022 మే 2, 2022న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు ఒకే షిఫ్ట్‌లో నిర్వహించారు. నీట్ ఎమ్‌డీఎస్ అనేది 2022-23 అకడమిక్ సెషన్ కోసం మాస్టర్స్ ఆఫ్ డెంటల్ సర్జరీ (MDS) కోర్సులో ప్రవేశం కోసం నిర్వహించే ఒక అర్హత పరీక్ష.
మరిన్ని కెరియర్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి