NEET 2022 Exam News: వైద్య విద్య కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (NEET 2022) ఈ ఏడాది జూన్‌లో జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేవారం విడుదల చేయడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కసరత్తులు చేస్తోంది. కాగా గత రెండేళ్లుగా కోవిడ్ -19 మహమ్మారి వల్ల నీట్ నిర్వహణ ఆలస్యమవుతూ వస్తోంది. దీనిపై విద్యార్ధుల్లో ఇప్పటికే ఆందోళన నెలకొంది. ఇక ఈ ఏడాదైనా నీట్ పరీక్షను సకాలంలో నిర్వహించాలని ఎన్టీఏ (NTA)వర్గాలు భావస్తున్నట్లు తెలుస్తోంది. కోవిడ్ ఉధృతి తగ్గుముఖం పట్టడంతో దేశ వ్యాప్తంగా అన్ని స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు తమ కార్యకలాపాలను యథావిథిగా కొనసాగిస్తున్నాయి. ప్రవేశాలు, పోటీ పరీక్షలే, అన్ని రకాల సెట్లకు నోటిఫికేషన్లు సిద్ధం అవుతున్నాయి. ఈ తరుణంలో నీట్ ప్రవేశాలు కూడా చేపట్టడానికి ఎన్టీఏ సన్నాహాలు చేస్తోంది.
Also Read: