
ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్, హోమియోపతిలో ఆయుర్వేదం, సిద్ధ, యునానిలలో బోధనా వృత్తి చేపట్టాలనుకునే పోస్ట్ గ్రాడ్యుయేట్ల కోసం ‘నేషనల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ NTET 2026 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటన వెలువరించింది. NTET ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి పదేళ్ల వరకు NTET సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ పరీక్షలో బోధనా కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఆప్టిట్యూడ్, తరగతి గది నిర్వహణ, శిక్షణ, మూల్యాంకన సాంకేతికత, బోధనా శాస్త్రం, విద్యార్థి మనస్తత్వశాస్త్రం, ఆండ్రాగోజీ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఆయుర్వేదం, సిద్ధ లేదా యునాని విభాగాల్లో పీజీ (PG) చదువుతున్న అభ్యర్థులు తప్పనిసరిగా 30 నెలల కోర్సు పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు సమయంలో సంబంధిత కాలేజీ నుంచి NOC పొందాలి. ఈ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 2, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
NTET దరఖాస్తు రుసుము కింద జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.4000, జనరల్-EWS, ఇతర వెనుకబడిన కులాలు- క్రీమీ లేయర్ కాని (OBC-NCL) కేటగిరీ అభ్యర్థులు రూ.3,500, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు (PwD), థర్డ్ జెండర్ కేటగిరీ అభ్యర్థులు రూ.3000 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ 28, 2026 (మంగళవారం)వ తేదీన దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో NTET 2026 పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష మొత్తం 120 నిమిషాల పాటు ఉంటుంది. ఇంగ్లిష్, హిందీ భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు.
నేషనల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NTET) 2026 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.