NIT Trichy Recruitment 2021: తమిళనాడులోని తిరుచిరపల్లిలో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (నిట్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 42 టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఉద్యోగులను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు గడువు రేపటితో (జులై 18) ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* మొత్తం 42 ఖాళీలకు గాను కెమిస్ట్రీ (03), సివిల్ ఇంజనీరింగ్ (11), కంప్యూటర్ అప్లికేషన్స్ (03), కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (06), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (02), ఎనర్జీ అండ్ ఇన్విరాన్‌మెంట్ (01), హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (04), ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ (02), మ్యాథమేటిక్స్ (01), మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ (05), ప్రొడక్షన్ ఇంజనీరింగ్ (04) ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
* అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.
* ఎంపికైన అభ్యర్థులకు జీతంగా రూ. 50 వేల వరకు అందిస్తారు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ముందుగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోని అనంతరం సంబంధిత డ్యాక్యుమెంట్లను జతచేసి ఆఫ్‌లైన్ విధానంలో పంపించాలి.
* దరఖాస్తులను ది రిజిస్ట్రార్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుచిరపల్లి – 620015, తమిళనాడు అడ్రస్‌కు పంపించాలి.
* అప్లై చేసుకున్న వారిని ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ రేపటితో (జులై 18) ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
IT Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది ఆ కంపెనీల నుంచి లక్షకుపైగా నియామకాలు..