NID AndhraPradesh Recruitment 2021: భారత ప్రభుత్వ కామర్స్, పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఉన్న క్యాంపస్‌లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చేయనున్నారు.
* మొత్తం 05 ఖాళీలకు గాను రిజిస్ట్రార్ (01), హెడ్ లైబ్రేరియన్ (01), అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (01), సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (02) పోస్టులను భర్తి చేయనున్నారు.
* దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఆన్లైన్లో అప్లై చేసుకునే క్రమంలో అభ్యర్థులు.. ఫొటోగ్రాఫ్‌తో పాటు సంబంధిత విద్యార్హతలను స్కానింగ్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల ప్రక్రియ 16-06-2021న ప్రారంభంకాగా.. చివరి తేదీని 20-07-2021గా నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Minister Sabitha Indra Reddy: తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం.. జులై 1 నుంచి ప్రత్యక్ష తరగతులు..