Bank Jobs 2022: బ్యాంక్‌ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? నైనిటాల్ బ్యాంక్‌లో100 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. వెంటనే..

|

Feb 08, 2022 | 9:20 PM

నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ (management trainee jobs), క్లర్క్‌ (clerk)పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది..

Bank Jobs 2022: బ్యాంక్‌ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? నైనిటాల్ బ్యాంక్‌లో100 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. వెంటనే..
Bank Jobs
Follow us on

Nainital Bank Recruitment 2022: నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్ (Nainital Bank) అనేది ప్రైవేట్ సెక్టార్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్.. నార్త్‌ ఇండియాలోని ఈ 5 రాష్ట్రాల్లో 164 శాఖల నెట్‌వర్క్‌తో హల్ద్వానీ, డెహ్రాడూన్, నోయిడాల్లో 3 చొప్పున ప్రాంతీయ కార్యాలయాలను కలిగి ఉంది. నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ (management trainee jobs), క్లర్క్‌ (clerk)పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 100

ఖాళీల వివరాలు:

  • మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు: 50
  • క్లర్క్‌ పోస్టులు: 50

అర్హతలు: అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ / పోస్ట్ గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్‌పై అవగాహన తప్పనిసరిగా కలిగి ఉండాలి.

దరఖాస్తు రుసుము: రూ.1500 దరఖాస్తు రుసుముగా చెల్లించాలి.

వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 15, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Covid -19: కరోనా వైరస్ మన చుట్టూ ఏయే వస్తువులపై బతికుంటుందో తెలుసా? షాకింగ్‌ విషయాలు వెల్లడి..