ఒకేసారి డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు ఎంపికైన ఆరుగురు అమ్మాయిలు.. ఇదేలా సాధ్యమైందంటే?

డ్రీమ్ అంటే కలలో వచ్చేది కాదు.. మిమ్మల్ని నిద్ర పోకుండా చేసేదని అబ్దుల్ కలాం అన్నమాటలు.. బహుశా ఈ అమ్మాయిలు మనో ఫలకం మీద బలంగా రాసుకున్నారేమో. ఏకంగా ఏకేసారి ఆరుగురు అమ్మాయిలు డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు ఎంపికయ్యారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఈ పరీక్షల్లో సత్తాచాటి అందరినీ అబ్బురపరిచారు..

ఒకేసారి డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు ఎంపికైన ఆరుగురు అమ్మాయిలు.. ఇదేలా సాధ్యమైందంటే?
MPPSC 2022 Toppers

Updated on: Jan 21, 2025 | 1:17 PM

UPSC, PCS పరీక్షలపై అమ్మాయిలలో ఆసక్తి పెరుగుతోంది. ఈ పరీక్షల్లో కూడా వారు అగ్రస్థానంలో నిలుస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష 2022 ఫలితాలు విడుదలవగా ఇందులో 394 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఇందులో ఒకరిద్దరు కాదు ఇద్దరు కాదు మొత్తం 6 మంది అమ్మాయిలు టాప్‌ టెన్‌ ర్యాంకులు సాధించడం విశేషం. ఈ పరీక్షలో దీపికా పాటిదార్ అనే అమ్మాయి ఏకంగా 902.75 మార్కులతో టాపర్‌గా నిలిచింది. దీపికా పాటిదార్ మధ్యప్రదేశ్‌లోని దేవాస్ నివాసి. MPPSC పరీక్ష 2022లో దీపికా పాటిదార్‌తో పాటు టాప్-10 ర్యాంకులు కొల్లగొట్టిన ర్యాంకర్లు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం..

టాప్-10లో ఆ ఆరుగురు అమ్మాయిలు వీరే..

మధ్యప్రదేశ్ పీసీఎస్ 2022 పరీక్షలో సురభి జైన్ మూడో స్థానంలో నిలిచింది. ఆమెకు 893 మార్కులు వచ్చాయి. మహిమా చౌదరి 888.50 మార్కులతో నాలుగో స్థానం సాధించింది. మెయిన్ పరీక్షలో మొత్తం 1400 మార్కులకు 778.50 మార్కులు రాగా, 175 మార్కుల ఇంటర్వ్యూలో 110 మార్కులు వచ్చాయి. ఇక షాను చౌదరి మొత్తం 885.50 మార్కులతో ఆరో ర్యాంకు సాధించింది. ఆమెకు మెయిన్ పరీక్షలో 783.50 మార్కులు, ఇంటర్వ్యూలో 102 మార్కులు వచ్చాయి.

ఈ పరీక్షలో స్వాతి సింగ్ 884.75 మార్కులతో 7వ స్థానంలో నిలిచింది. మెయిన్ పరీక్షలో 749.75 మార్కులు, ఇంటర్వ్యూలో 135 మార్కులు వచ్చాయి. కవితా దేవి యాదవ్ 882.75 మార్కులతో 9వ స్థానంలో నిలిచింది. మెయిన్ పరీక్షలో 772.75 మార్కులు, ఇంటర్వ్యూలో 110 మార్కులు వచ్చాయి. మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకారం.. టాప్-10లో వచ్చిన ఈ ఆరుగురు అమ్మాయిలు డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు ఎంపికయ్యారు.

ఇవి కూడా చదవండి

టాప్-10లో నిచినల అబ్బాయిలు ఎవరంటే..

MPPCS 2022 పరీక్షలో మొత్తం నలుగురు అబ్బాయిలు మాత్రమే టాప్-10లో నిలిచారు. ఆదిత్య నారాయణ్ తివారీ 897.50 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచారు. మెయిన్ పరీక్షలో 767.50 మార్కులు, ఇంటర్వ్యూలో 130 మార్కులు వచ్చాయి. ధరమ్ ప్రకాష్ మిశ్రా 885.75 మార్కులతో ఐదో స్థానం సాధించగలిగాడు. మెయిన్ పరీక్షలో 770.75 మార్కులు, ఇంటర్వ్యూలో 115 మార్కులు వచ్చాయి. ఉమేష్ అవస్తీ 883.50 మార్కులతో 8వ స్థానం సాధించాడు. మెయిన్ పరీక్షలో 759.50 మార్కులు, ఇంటర్వ్యూలో 124 మార్కులు సాధించాడు. ప్రత్యూష్ శ్రీవాస్తవ 878.50 మార్కులతో 10వ స్థానంలో నిలిచాడు. మెయిన్ పరీక్షలో 733.50 మార్కులు, ఇంటర్వ్యూలో 145 మార్కులు వచ్చాయి. వీరంతా అహోరాత్రులు కష్టపడి చదివి తమ కలల కొలువును సొంతం చేసుకున్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.