Fact Check: నిరుద్యోగులకు అలెర్ట్‌.. NTPC ఉద్యోగ నోటిఫికేషన్లపై కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన..

|

Apr 27, 2022 | 3:06 PM

Ministry Of Railways: నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. షార్ట్‌కట్‌లో భారీ జీతాలతో జాబులు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు.

Fact Check: నిరుద్యోగులకు అలెర్ట్‌.. NTPC ఉద్యోగ నోటిఫికేషన్లపై కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన..
Ministry Of Railways
Follow us on

Ministry Of Railways: నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. షార్ట్‌కట్‌లో భారీ జీతాలతో జాబులు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ఫేక్‌ ఆఫర్స్‌ లెటర్లు, అపాయింట్‌మెంట్‌ లెటర్లు సైతం సృష్టించి అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. నకిలీ ఉద్యోగ ప్రకటనల మోసాలు ఎన్ని వెలుగులోకి వస్తోన్న నిరుద్యోగులు ఇంకా మోసపోతూనే ఉన్నారు. ముఖ్యంగా రైల్వేశాఖలో ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈక్రమంలో NTPC ఉద్యోగాలకు సంబంధించి సోషల్‌ మీడియాలో సర్క్యూలేట్‌ అవుతున్న కొన్ని నకిలీ నోటిఫికేషన్లపై కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ (Ministry Of Railways) ఓ కీలక ప్రకటన చేసింది.

NTPC ఉద్యోగాలకు సంబంధించి కంప్యూటర్‌ బేస్ట్‌ టెస్ట్-2 (CBT-2) పరీక్షల షెడ్యూల్‌ విడుదలైందని ఇటీవల నెట్టింట్లో కొన్ని ఫేక్‌ నోటిఫికేషన్లు వచ్చాయి. స్టేజ్‌-1 పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు మే 19, 20 జూన్‌-13, 14,15,16 తేదీల్లో CBT-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు అందులో సమాచారముంది. అయితే ఈ ప్రకటనలు నకీలివని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇలాంటి ప్రకటనలను నమ్మవద్దని అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా అభ్యర్థులను హెచ్చరించింది. ‘రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు CBT-2కి పరీక్షలకు సంబంధించి సోషల్‌ మీడియాలో నకిలీ నోటిఫికేషన్లు సర్క్యూలేట్‌ అవుతున్నాయి. ప్రస్తుతానికి రైల్వే శాఖ ఎలాంటి ప్రకటనలు వెలువరించలేదు. నకిలీ ఉద్యోగ ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండండి’ అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చింది.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తలకు క్లిక్ చేయండి..

Also Read:

Viral Video: అయ్యయ్యో భలే పని జరిగిందే..? కొత్త కోడలికి ఊహించని అనుభవం

Akshaya Tritiya sales: బంగారం, అభరణాల కొనుగోలుదారులకు అదిరిపోయే శుభవార్త.. భారీ ఆఫర్లు!

Andhra Pradesh: చంద్రబాబుకు ఇచ్చిన నోటీసు చెత్త కాగితంతో సమానం.. బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్య