MANAGE Recruitment: హైదరాబాద్‌ మేనేజ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షలకుపైగా జీతం పొంద అవకాశం..

|

May 06, 2022 | 1:03 PM

MANAGE Recruitment: హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌ (MANAGE) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థలో ఖాళీలను భర్తీ చేయనున్నారు...

MANAGE Recruitment: హైదరాబాద్‌ మేనేజ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షలకుపైగా జీతం పొంద అవకాశం..
Follow us on

MANAGE Recruitment: హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌ (MANAGE) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 07 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో డైరెక్టర్‌ (02), అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ (యూడీసీ) 01, జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ (నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేషన్‌) 01, జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ట్రెయినింగ్‌) 01, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (ఎంటీఎస్‌) 02 ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా పదో తరగతి, ఇంటర్మీడియట్‌, బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎమ్మెస్సీ (అగ్రికల్చర్‌) డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులు తమ వివరాలను డిప్యూటీ డైరెక్టర్‌ (అడ్మినిస్ట్రేషన్‌), మేనేజ్‌, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌ 500030 అడ్రస్‌కు పంపించాలి.

* అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన వారికి నెలకు రూ. 18,000 నుంచి రూ. 2,18,200 వరకు చెల్లిస్తారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తలకు క్లిక్ చేయండి..

Also Read: Nap at Office: ఆఫీసులో ఉద్యోగులు మధ్యాహ్నం ఓ అరగంటపాటు ఓ కునుకు తీయొచ్చు.. ఓ స్టార్టప్‌ కంపెనీ వినూత్న నిర్ణయం..

Rajasekhar : మీరు ప్రార్ధించి నన్ను బ్రతికించింది ఈ సినిమా కోసమే.. ఎమోషనల్ అయిన రాజశేఖర్

పక్షులన్నీ కలిసి ఎగిరాయి.. భారీ రాకాసి పక్షి ఆకారంలో.. వైరలవుతున్న ఫొటో