న్యూఢిల్లీలోని మౌలానా ఆజాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్.. 22 జూనియర్ రెసిడెంట్ (డెంటల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీడీఎస్‌తోపాటు ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. పోస్టు గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అనర్హులు. అలాగే ఏదైనా ఆసుపత్రి లేదా ఇన్‌స్టిట్యూట్‌లో ఇప్పటికే జూనియర్ రెసిడెంట్‌గా పనిచేసినవారు కూడా అనర్హులు. అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఆసక్తి కలిగినవారు ఆఫ్‌లైన్ విధానంలో డిసెంబర్ 31, 2023వ తేదీ 12 గంటలలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. జనరల్/ఓబీసీ కేటగిరీ వారు రూ.1000లు, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వారు రూ.500లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. స్ర్కీన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.56,100ల నుంచి రూ.1,77,500ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
The Director-Principal, MAIDS, Room N o. 116, First Floor, Maulana Azad Institute of Dental Sciences,
Bahadur Shah Zafar Marg, New Delhi-110002.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.