Medical Education Reservation Policy In Tamil Nadu: ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్ధులకు వైద్య విద్యలో 7.5 శాతం రిజర్వేషన్ కల్పించే విధంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం చెల్లుబాటవుతుందని మద్రాసు హైకోర్టు (Madras High Court ) గురువారం (ఏప్రిల్ 7న) తీర్పు ఇచ్చింది. ‘ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు (government school students) వైద్య విద్యలో 7.5 శాతం రిజర్వేషన్ కల్పించడం చెల్లుతుంది. రిజర్వేషన్ కల్పించడానికి ప్రభుత్వానికి అధికారం ఉంది. ఐదేళ్ల తర్వాత ఈ అంశాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించాలి’ అని నిర్దేశిస్తూ ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చిన సందర్భంలో దాన్ని సవాలు చేస్తూ మద్రాసు హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
రాష్ట్రంలో 69 శాతం రిజర్వేషన్ అమల్లో ఉండగా, మిగిలిన 31 శాతంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 7.5 శాతం రిజర్వేషన్ కల్పించడంతో జనరల్ కేటగిరీలో అర్హులైన విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని పిటిషనర్లు పేర్కొన్నారు. ఎయిడెడ్ విద్యార్థులను పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని, రిజర్వేషన్ కల్పనలో పక్షపాతం చూపుతుందని మరికొన్ని వ్యాజ్యాలు దాఖలయ్యాయి. జనరల్ కేటగిరీకి కేటాయించిన 31 శాతంలో 7.5 శాతం రిజర్వేషన్ కల్పించలేదని, మొత్తాన్ని పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకున్నారని, దీనివల్ల జనరల్ కేటగిరీ విద్యార్థులకు నష్టం లేదని విచారణ సమయంలో ప్రభుత్వ తరఫు న్యాయవాది గతంలో కోర్టుకు నివేదించారు.
Also Read: