నిన్నటి వరకు ట్విట్టర్…ఇప్పుడు మైక్రోసాఫ్ట్… ఉద్యోగాల తొలగింపు కార్యక్రమంలో ప్రముఖ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ కూడా ఉద్యోగుల తొలగింపు మొదలు పెట్టింది. మరికొన్ని పెద్ద సంస్థలతోపాటు చిన్న సంస్థలు కూడా లేఆఫ్స్ ప్రకటించడం రివాజుగా మార్చుకున్నాయి. భారీ సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు అత్యంత వేగంగా చర్యలు చేపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక టెక్ కంపెనీల నుంచి ఉద్యోగులను తొలగిస్తున్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలు ఇటీవల వేల మంది ఉద్యోగులను తొలగించాయి. ఇప్పుడు పేపాల్, హబ్‌స్పాట్ లేఆఫ్‌లను ప్రకటించగా.. మరో దిగ్గజ కంపెనీ ఇంటెల్ మాత్రం ఇలాంటి ఈ దారుణానికి దిగకుండా.. పెద్ద కంపెనీలకు దిమ్మతిరిగే నిర్ణయం తీసుకుంది. ఉద్యోగల పట్ల నిర్దయతో వ్యవహరించకుండా.. కేవలం కొందరి జీతాలో కోతలను ప్రకటించింది. అది కూడా చిన్న ఉద్యోగులపై కాకుండా టాప్ హెడ్స్ జీతాల్లో కోత పెట్టింది. అది కూడా కేవలం 5 శాతం నుంచి 10 శాతం మాత్రం.
గ్లోబల్ సెమీకండక్టర్ల తయారీ సంస్థ ఇంటెల్ (ఇంటెల్) CEO సహా మేనేజ్‌మెంట్, సీనియర్ సిబ్బంది జీతంలో కోత విధించింది. సీఈఓ పాట్ గెల్సింగర్ మూల వేతనాన్ని 25 శాతం తగ్గించాలని టెక్ కంపెనీ యోచిస్తోందని ఇంటెల్ బ్లూమ్‌బెర్గ్‌తో తెలిపింది. ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ టీమ్ జీతంలో 15 శాతం తగ్గింపు ఉంటుంది. సీనియర్ మేనేజర్ జీతంలో 10 శాతం, మిడ్ లెవల్ మేనేజర్ జీతంలో 5 శాతం తగ్గింపు ఉంటుంది.
ఇంటెల్ తీసుకున్న నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. కోతల పేరుతో వాడుకుని పడేస్తున్న కంపెనీల కంటే ఇంటెల్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని అంటున్నారు. చిన్న ఉద్యోగుల జాబ్స్ కోల్పోతే కుటుంబాలు రోడ్లపై పడుతుండటం ఆందోళనగా ఉందంటున్నారు.
తొలగించనుంది సాఫ్ట్‌వేర్ కంపెనీ హబ్‌స్పాట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగులలో 7 శాతం మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో దాదాపు 500 మంది ఉపాధి కోల్పోనున్నారు. కంపెనీ CEO యామిని రంగన్ ఇలా వ్రాశారు, “మేము హబ్‌స్పాట్ చరిత్రలో అత్యంత క్లిష్టమైన నిర్ణయాలలో ఒకటి తీసుకోవలసి వచ్చింది. మేము మా బృందం పరిమాణాన్ని 7 శాతం తగ్గించాలని నిర్ణయించుకున్నాం. సుమారు 500 హబ్‌స్పాటర్‌లకు వీడ్కోలు పలుకుతున్నాం. ఈ చర్య తీసుకున్నందుకు నేను తీవ్రంగా చింతిస్తున్నాను.” అంటూ పేర్కొన్నారు.
క్రెడిట్ కార్డ్, ఆన్‌లైన్ చెల్లింపు ఇంటర్‌ఫేస్ పేపాల్ హోల్డింగ్స్ మంగళవారం తన ఉద్యోగులను 7 శాతం తగ్గించనున్నట్లు తెలిపింది. ఈ సంఖ్య దాదాపు 2,000 మంది ఉద్యోగులు.
యాపిల్ ఉద్యోగుల తొలగింపుల నుండి బయటపడింది. చాలా పెద్ద టెక్ కంపెనీలు ఖర్చులను తగ్గించుకోవడానికి తొలగించాయి. ప్రస్తుతం యాపిల్ మాత్రమే పెద్ద సంస్థ అయినప్పటికీ, ఇప్పటివరకు రిట్రెంచ్‌మెంట్‌ను నివారించగలిగింది. శ్రామిక శక్తిని తగ్గించకుండా ఉండటానికి కంపెనీ CEO టిమ్ కుక్ జీతంలో 40 శాతం కోత విధించింది.
మరిన్ని కెరియర్, ఉద్యోగాల వార్తల కోసం