KVS Class 1 Admissions 2022: కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు రేపే ఆఖరు!
కేంద్రీయ విద్యాలయాల్లో (KVS) 2022-23 విద్యాసంవత్సరానికిగానూ ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు రేపటితో (ఏప్రిల్ 13) ముగియనుంది..
KVS Class 1 Admission 2022 application last date: కేంద్రీయ విద్యాలయాల్లో (KVS) 2022-23 విద్యాసంవత్సరానికిగానూ ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు రేపటితో (ఏప్రిల్ 13) ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని పిల్లల తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే అధికారిక వెబ్‌సైట్ kvsonlineadmission.kvs.gov.inలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవల్సిందిగా కేవీఎస్ సూచించింది. కాగా గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు గడువు ఏప్రిల్ 11తో ముగియనుండగా, ఢిల్లీ హైకోర్టు ఆదేశానుసారం చివరితేదీని తాజాగా పొడిగించింది. ఈ ఏడాది కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 28 (సోమవారం) ప్రారంభమైన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగానున్న పలు కేంద్రీయ విద్యాలయాల్లో వివిద తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. 12వ తరగతి ఫలితాలు విడుదలైన పది రోజుల్లోపు 10వ తరగతి ప్రవేశాలు కూడా నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా పేర్కొంది.
KVS Class 1 Admission 2022కు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ kvsonlineadmission.kvs.gov.inను ఓపెన్ చెయ్యాలి.
- హోమ్‌పేజ్‌లో కనిపించే రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేశాక, అడ్మిషన్ అప్లికేషన్ పోర్టల్‌కి లాగిన్ అవ్వాలి.
- తగిన సమాచారాన్ని అడ్మిషన్ అప్లికేషన్ ఫామ్‌లో నింపి, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి, సబ్‌మిట్ చెయ్యాలి.
- పూరించిన దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్‌ఔట్ తీసుకోవాలి.
Also Read: