IAS Interview : గాయపడినప్పుడు ఏ జంతువు మనిషిలా ఏడుస్తుంది?.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్నలు మీ కోసం..

UPSC IAS Interview Questions: UPSC ఇంటర్వ్యూలలో కూడా అడిగే కొన్ని విచిత్రమైన.. గమ్మత్తైన ప్రశ్నలు ఈ రోజు మనం తెలుసుకుందాం.

IAS Interview : గాయపడినప్పుడు ఏ జంతువు మనిషిలా ఏడుస్తుంది?.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్నలు మీ కోసం..
Upsc Ias Interview Question
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 20, 2022 | 12:21 PM

UPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా కలెక్టర్‌ కావాలనేది దేశంలోని లక్షలాది మంది యువత కల. చాలా మంది యువకులు UPSC నిర్వహించే ప్రిలిమినరీ, మెయిన్ రాత పరీక్షలో ఉత్తీర్ణులవుతారు. కానీ చాలా సార్లు UPSC నిర్వహించే ఇంటర్వ్యూల్లో అడిగే ప్రశ్నలు వారి విజయానికి ఆటంకంగా మారుతుంటాయి. అయితే కొన్నిసార్లు వారు అడుగే ప్రశ్నలు చాలా సులువుగా ఉంటాయి. కానీ అవి అడిగే విధానం కారణంగా.. అభ్యర్థి గందరగోళానికి గురవుతాడు. దీంతో అతని టార్గెట్‌కు బ్రేక్ పడుతుంది. UPSC ఇంటర్వ్యూలలో కూడా అడిగే కొన్ని విచిత్రమైన.. గమ్మత్తైన ప్రశ్నలు ఈ రోజు మనం తెలుసుకుందాం.

ప్రశ్న: గాయపడినప్పుడు ఏ జంతువు మనిషిలా ఏడుస్తుంది?

సమాధానం: ఎలుగుబంటి గాయపడినప్పుడు మనిషిలా ఏడుస్తుంది.

ప్రశ్న: ఏ జంతువు ఎప్పుడూ ఆవలించదు?

జవాబు: జిరాఫీ ఎప్పుడూ ఆవలించని జంతువు.

ప్రశ్న: ఏది కట్ చేసి జనం సంబరాలు జరుపుకుంటారు?

సమాధానం: కేక్.

ప్రశ్న: నీలి సముద్రంలో ఎర్ర రాయి పెడితే ఏమవుతుంది?

సమాధానం: రాయి తడిగా మారుతుంది. మునిగిపోతుంది.

ప్రశ్న: ఒక వ్యక్తి 1935లో పుట్టి 1935లో చనిపోయాడు.. అయితే మరణించే నాటికి అతడి వయసు 70 ఏళ్లు ఎలా ?

సమాధానం: ఆ వ్యక్తి 1935లో జన్మించాడు. అతను మరణించిన ఆసుపత్రి గది 1935 (19వ అంతస్తులోని గది సంఖ్య 35) అప్పటికి 70 ఏళ్లు.

ప్రశ్న: బంగాళాఖాతం ఏ స్థితిలో ఉంది?

సమాధానం; బంగాళాఖాతం ద్రవ స్థితిలో ఉంది.

ప్రశ్న: బయట ఉచితంగా, డబ్బుతో ఆసుపత్రిలో లభించేవి ఏమిటి?

సమాధానం: ఆక్సిజన్.

ప్రశ్న: నెమలి గుడ్లు పెట్టదు. అయితే దాని పిల్లలు గుడ్ల నుంచి పుడతాయి.. ఎలా?

సమాధానం: ఎందుకంటే ఆడ నెమలి గుడ్లు పెడుతుంది.

ప్రశ్న: ఒకసారి పెరిగినా మళ్లీ తగ్గనిది ఏంటి?

సమాధానం: వయస్సు.

ప్రశ్న: మనం చూస్తే కానీ చదవని పదం?

జవాబు: లేదు.

ప్రశ్న: ఎనిమిది రోజులు నిద్ర లేకుండా మనిషి ఎలా బ్రతకగలడు?

సమాధానం: ఎందుకంటే, అతను రాత్రి నిద్రపోతాడు.

కెరీర్ & ఉద్యోగల న్యూస్ కోసం..