NEET 2022: మరోసారి జేఈఈ పరీక్షా తేదీల్లో మార్పులు.. ‘నీట్’ దరఖాస్తులకు నేటి నుంచి ఆహ్వానం..
NEET 2022: జేఈఈ మెయిన్ (JEE Mains) పరీక్షల తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పరీక్షల తేదీలను మరోసారి మార్చించి. నిజానికి ఈ పరీక్షలను ఏప్రిల్ 21 నుంచి మే 4 వరకు నిర్వహించాల్సి ఉంది. కానీ...
NEET 2022: జేఈఈ మెయిన్ (JEE Mains) పరీక్షల తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పరీక్షల తేదీలను మరోసారి మార్చించి. నిజానికి ఈ పరీక్షలను ఏప్రిల్ 21 నుంచి మే 4 వరకు నిర్వహించాల్సి ఉంది. కానీ తాజాగా మారిన షెడ్యూల్ ప్రకారం సెషన్ 1 పరీక్షలను జూన్ 20 నుంచి 29 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలను జూలై 21 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు.
నేటి నుంచి నీట్ దరఖాస్తులు ప్రారంభం..
ఇదిలా ఉంటే వైద్య విద్య కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ (యూజీ)-2022కి సంబంధించి గురువారం నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దేశంలో 543 ప్రాంతాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. నేటి నుంచి మే 6 రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇక పరీక్షను జులై 17న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్షను తెలుగుతో పాటు 13 స్థానిక భాషల్లో నిర్వహించనున్నారు. పరీక్ష ఫీజు విషయానికొస్తే.. జనరల్ కేటగిరి వారికి రూ.1600, EWS, ఓబీసీ3 NCL విద్యార్థులకు రూ.1500, SC, ST, థర్డ్ జెండర్ వారికి రూ.900, విదేశీ విద్యార్థులకు రూ. 8,500గా నిర్ణయించారు.
నీట్ రాయాలనుకునే విదీశీ విద్యార్థుల కోసం 14 దేశాల్లో నీట్ పరీక్షను నిర్వహించనున్నారు. యూఏఈ (అబుదాబి), థాయ్‌లాండ్ (బ్యాంకాక్), శ్రీలంక (కొలంబో), ఖతర్ (దోహా), యూఏఈ (దుబాయ్), నేపాల్ (ఖాట్మండు), మలేసియా (కౌలాంపూర్), కువైట్ (కువైట్ సిటీ), నైగేరియా (లాగోస్), బహ్రీన్ (మనమా), ఓమన్ (మస్కట్), సౌదీ అరేబియా (రియాద్), యూఏఈ (షార్జా), సింగపూర్ (సింగపూర్)లో పరీక్ష నిర్వహించనున్నారు.
JEE (Main)dates rescheduled to enable students across the country to prepare well for the exams. @dpradhanbjp @EduMinOfIndia pic.twitter.com/QYABHnd7SC
— National Testing Agency (@DG_NTA) April 6, 2022
Application Process for NEET (UG) 2022 is now open. All the best. @EduMinOfIndia pic.twitter.com/fYibGc0JaB
— National Testing Agency (@DG_NTA) April 6, 2022
Also Read: Crime news: కెమెరాకు చిక్కిన మాదన్నపేట్ రెడ్డి సంఘం అధ్యక్షుడు.. అర్ధరాత్రి సమయంలో ఆ పనులు
Pudding Pub: పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసు.. నాంపల్లి కోర్టులో రిమాండ్ రిపోర్టు.. కీలక విషయాలు