JEE Main Session 2 Result Date 2025: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 ఫలితాల తేదీ ఇదే.. ఆ మర్నాడే అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్లు షురూ

బీఈ/ బీటెక్‌ ప్రవేశాల కోసం పేపర్‌1 పరీక్ష రాసిన అభ్యర్థులు ప్రాథమిక కీ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. దీనిపై అభ్యంతరాలను ఏప్రిల్‌ 13వ తేదీలోపు తెలపవల్సి ఉంటుంది. అభ్యంతరాల స్వీరణ అనంతరం ఫైనల్ ఆన్సర్ కీ తయారు చేసి, ఆ వెనువెంటనే ఫలితాలను కూడా విడుదల చేయనున్నారు..

JEE Main Session 2 Result Date 2025: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 ఫలితాల తేదీ ఇదే.. ఆ మర్నాడే అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్లు షురూ
JEE Main Session 2 Result Date 2025

Updated on: Apr 13, 2025 | 3:46 PM

హైదరాబాద్, ఏప్రిల్ 13: దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి బీటెక్‌, బీఆర్క్‌ సీట్ల భర్తీకి సంబంధించి నిర్వహించిన జేఈఈ మెయిన్‌ 2025 సెషన్‌ 2 పరీక్షలు ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు జరిగాయి. ఏప్రిల్‌ 2, 3, 4, 7, 8 తేదీల్లో పేపర్‌-1 (బీఈ/ బీటెక్‌) పరీక్షలు, ఏప్రిల్‌ 9వ తేదీన పేపర్‌-2ఏ, 2బీ (బీఆర్క్‌/బీ ప్లానింగ్‌) ప్రవేశ పరీక్షలు జరిగాయి. అయితే ఈ తేదీల్లో సీబీఎస్సీ బోర్డు పరీక్షలు రాసి విద్యార్ధులకు ప్రత్యేకంగా మరోమారు జేఈఈ మెయిన్‌ పరీక్షలు ఎన్టీయే నిర్వహించింది. ఈ పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీ విడుదలయింది. బీఈ/ బీటెక్‌ ప్రవేశాల కోసం పేపర్‌1 పరీక్ష రాసిన అభ్యర్థులు ప్రాథమిక కీపై అభ్యంతరాలను ఏప్రిల్‌ 13వ తేదీలోపు తెలపవల్సి ఉంటుంది. అభ్యంతరాల స్వీరణ అనంతరం ఫైనల్ ఆన్సర్ కీ తయారు చేసి, ఆ వెనువెంటనే ఫలితాలను కూడా విడుదల చేయనున్నారు.

జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 ప్రాథమిక ఆన్సర్ కీ 2025 కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఈ మేరకు ఏప్రిల్ 17, 2025వ తేదీన జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 2025 పరీక్షల ఫలితాలను వెల్లడించేందుకు ఎన్టీయే ఏర్పాట్లు చేస్తుంది. ఫలితాల అనంతరం జేఈఈ మెయిన్ రెండు సెషన్లలో బెస్ట్ స్కోర్ చేసిన తొలి 2.5 లక్షల మందిని సెలక్ట్‌ చేసి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 ఫలితాలు వెల్లడించిన మరుసటి రోజే అంటే ఏప్రిల్ 18 నుంచే అడ్వాన్స్‌డ్‌ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభిస్తుంది.

ఇవి కూడా చదవండి

వెయ్యి మంది మెడికల్‌ రెప్రజెంటేటివ్‌ల నియామకాలు: మోర్‌పెన్‌

మూడేళ్లలో దాదాపు వెయ్యి మంది మెడికల్‌ రెప్రజెంటేటివ్‌లను నియమించుకుంటామని మోర్‌పెన్‌ ల్యాబొరేటరీస్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఇందులో 200 మందిని నియమించుకోనున్నట్లు వెల్లడించింది. ఫార్ములేషన్స్‌ వ్యాపారాన్ని బలోపేతం చేసుకోవడమే నూతన నియామకాల ధ్యేయమని సంస్థ సీఎండీ సుశీల్‌ సూరి పేర్కొన్నారు. ప్రస్తుతం సంస్థ ఫార్ములేషన్ల వార్షిక వ్యాపారం రూ.325 కోట్లకు చేరుకుంది. దీన్ని మూడింతలు చేసి రూ. వెయ్యి కోట్లకు చేర్చాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.