
హైదరాబాద్, డిసెంబర్ 26: దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీల్లో బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీకి నిర్వహించనున్న జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ 2026 జనవరి సెషన్ పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల కానున్నాయి. అంతకంటే ముందు జేఈఈ మెయిన్ సిటీ స్లిప్ 2026 స్లిప్‌లను మొదట ఎన్టీయే విడుదల చేస్తుంది. వీటిని జనవరి మూడవ వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. అడ్మిట్ కార్డులను జనవరి 18 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. రాత పరీక్ష తేదీకి సరిగ్గా నాలుగు రోజుల ముందు అడ్మిట్ కార్డులను విడుదల చేయనుంది. ఇక జేఈఈ మెయిన్ జనవరి సెషన్ పరీక్ష 2026లు జనవరి 21 నుంచి 30 మధ్య జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే పూర్తి షెడ్యూల్‌ను కూడా ఎన్టీయే ప్రకటించింది.
కాగా జేఈఈ మెయిన్ పరీక్షను యేటా రెండు సార్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జనవరిలో తొలివిడ, ఏప్రిల్ నెలలో తుది విడత పరీక్షలు జరుగుతాయి. EE మెయిన్ 2026 పరీక్ష మన దేశంతోపాటు విదేశాలలోనూ బహుళ పరీక్షకేంద్రాలలో ఆన్‌లైన్ విధానంలో (CBT) నిర్వహిస్తారు. ఈ పరీక్షకు రెండు వేర్వేరు పేపర్లు ఉంటాయి. BE/B.Tech ప్రవేశాల కోసం పేపర్ 1, బిఆర్క్, బిప్లానింగ్ కోర్సులకు పేపర్ 2 పరీక్ష రాయవల్సి ఉంటుంది. రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్ష జరుగుతుంది. ఉదయం 9-12 వరకు, మధ్యాహ్నం 3-6 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్షలను తెలుగు, ఇంగ్లిష్‌తో సహా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. పేపర్ 1 పరీక్ష 300 మార్కులకు, పేపర్ 2 పరీక్ష 400 మార్కులకు ఉంటుంది. అడ్మిషన్ కోసం తుది మెరిట్ జాబితాను తయారు చేసేటప్పుడు రెండు సెషన్ల నుంచి మెరుగైన స్కోర్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. తొలి విడత ఫలితాలు ఫిబ్రవరి 12 నాటికి వెల్లడిస్తారు.
జేఈఈ మెయిన్ 2026 అడ్మిక్ కార్డుల డౌన్ లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.