JEE Advanced Result: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ను ఇలా సులువుగా చూసుకోండి..

|

Oct 15, 2021 | 10:40 AM

JEE advanced result 2021: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్‌డ్ (JEE advanced) ఫలితాలను ఖరగ్‌పూర్‌ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉదయం

JEE Advanced Result: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ను ఇలా సులువుగా చూసుకోండి..
Jee Result
Follow us on

JEE advanced result 2021: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్‌డ్ (JEE advanced) ఫలితాలను ఖరగ్‌పూర్‌ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉదయం 10 గంటలకు విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.in లో ఫలితాలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు తమ రోల్ నంబర్ మరియు/లేదా వ్యక్తిగత వివరాలను నమోదు చేసి JEE అడ్వాన్స్‌డ్ ఫలితాలను చూసుకోవచ్చు. ఐఐటీ ఖరగ్‌పూర్ జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలతో పాటు ఆల్ ఇండియా టాపర్స్, ఇతర వివరాలను కూడా విడుదల చేసింది. ఐఐటీల్లో ప్రవేశాల కోసం అక్టోబర్ 3 న దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) లో ప్రవేశానికి (JoSAA) కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అర్హులు. జేఈఈ అడ్వాన్స్‌డ్ మార్కుల ఆధారంగా జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకులను నిర్ణయించనున్నారు.

ఫలితాన్ని ఇలా చెక్ చేసుకోండి..
అధికారిక వెబ్‌సైట్ – jeeadv.ac.in కి లాగిన్ అవ్వాలి.
రిజల్ట్ లింక్‌పై క్లిక్ చేయండి
JEE అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి క్లిక్ ఇవ్వాలి,
ఆ తర్వాత రిజల్ట్ కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

రేపటినుంచే.. కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం..
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో.. దేశంలోని ప్రముఖ ఐఐటీ కళాశాలల్లో ప్రవేశాల కోసం రేపటి నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలుకానుంది. శనివారం నుంచి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దేశంలోని 23 ఐఐటీలు, 32 ఎన్‌ఐటీలు, 26 ట్రిపుల్‌ ఐటీల్లోని సీట్ల భర్తీ కోసం ఈ కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నారు.
ఈ నెల 22, 24 తేదీల్లో జోసా మాక్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ నెల 25 వరకు ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. 27న మొదటి దశ సీట్లను కేటాయించనున్నారు. నవంబరు 1న రెండో దశ సీట్ల కేటాయింపు, నవంబరు 6న మూడో దశ, 10న నాల్గవ విడత, 12న నాల్గవ విడత, 14న ఐదవ విడత, 18న ఆరో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జరగనుంది. మొత్తం ఆరుదశల్లో నవంబరు 18వ తేదీ వరకు సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగనుండగా.. చివరి దశలో సీటు పొందిన విద్యార్థులు నవంబర్‌ 20 నాటికి రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది.

Also Read:

Viral Video: చర్చిలో బంగారం దోచుకెళ్లిన ప్రబుద్ధుడు.. సీన్ చూస్తే షాకవ్వాల్సిందే.. వీడియో వైరల్..

Spying: పాక్ మహిళతో వాట్సప్ చాటింగ్.. మిలటరీ ఉద్యోగి అరెస్ట్.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..