కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషణ్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 545 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ కానున్నాయి. మొత్తం పోస్టులో యూఆర్ కేటగిరీలో 209 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 77 పోస్టులు, ఎస్టీ కేటగిరీలో 40 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో 164 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 55 పోస్టులు ఉన్నాయి. పదో తరగతి అర్హత కలిగిన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఐటీబీపీ ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్, 2024వ తేదీలోగా కానిస్టేబుల్ (డ్రైవర్) గ్రూప్ ‘సి’ నాన్-గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి. వయోపరిమితి కింద తప్పని సరిగా 21 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన వారు రూ.100 రిజిస్ట్రేషన్ ఫీజు కింద చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ), రాత పరీక్ష, ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అన్ని దశల్లో ప్రతిభకనబరచి ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతంగా చెల్లిస్తారు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.