ITBP Recruitment: ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు.. అర్హులు ఎవరంటే..

|

Jul 15, 2022 | 10:13 AM

ITBP Recruitment: ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌(ఐటీబీపీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. నోటిఫికేషన్‌లో భాగంగా అర్హులైన పురుషులు, స్త్రీల నుంచి గ్రూప్‌ బి నాన్‌ గెజిటెడ్‌ (నాన్‌ మినిస్టీరియల్‌) సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులను...

ITBP Recruitment: ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు.. అర్హులు ఎవరంటే..
Follow us on

ITBP Recruitment: ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌(ఐటీబీపీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. నోటిఫికేషన్‌లో భాగంగా అర్హులైన పురుషులు, స్త్రీల నుంచి గ్రూప్‌ బి నాన్‌ గెజిటెడ్‌ (నాన్‌ మినిస్టీరియల్‌) సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీచేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 37 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటిలో పురుషులు (32), స్త్రీలు (05) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెట్రిక్యులేషన్‌/సివిల్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌(పీఈటీ), ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌(పీఎస్‌టీ), రాతపరీక్ష, డాక్యుమెంటేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 16-07-2022న ప్రారంభమవుతండగా, 14-08-2022తో ముగియనుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..