ITBP Recruitment: ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌ పోస్టులు.. అర్హతలు ఇవే..

ITBP Recruitment: ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో పని చేసే ఈ పోలీస్‌ ఫోర్స్‌లో పలు విభాగాల్లో ఉన్న కానిస్టేబుల్‌...

ITBP Recruitment: ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌ పోస్టులు.. అర్హతలు ఇవే..
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 03, 2022 | 9:44 PM

ITBP Recruitment: ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో పని చేసే ఈ పోలీస్‌ ఫోర్స్‌లో పలు విభాగాల్లో ఉన్న కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 108 పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటిలో కానిస్టేబుల్(కార్పెంటర్) (56), కానిస్టేబుల్(మేసన్) – (31), కానిస్టేబుల్(ప్లంబర్) – (21) పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెట్రిక్యులేషన్ లేదా తత్సమానం పూర్తి చేసి ఉండాలి. అలాగే గుర్తింపు పొందిన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక సంవత్సరం సర్టిఫికేట్ కోర్సు పొంది ఉండాలి.

* అభ్యర్థుల వయసు 17-09-2022 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఫిజికల్ ఎఫిషియెన్సీ, ఫిజికల్ స్టాండర్డ్, రాత, ట్రేడ్ టెస్టులు, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్/ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపి చేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 19-08-2022వ తేదీన మొదలై 17-0-2022 తేదీతో ముగియనుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి…

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్