ITBP Recruitment: ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్‌లో (ITBP) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన ఈ పోలీస్ ఫోర్స్‌లో గ్రూప్ సీ నాన్ గెజిటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మహిళా, పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 158 హెడ్ కానిస్టేబుల్ (డైరెక్ట్ ఎంట్రీ) పోస్టులను భర్తీ చేయనున్నారు.
* వీటిలో మేల్-135 ఫిమేల్-23 ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్మీడియట్ (10+2)/ తత్సమాన ఉత్తీర్ణత. టైపింగ్ స్పీడ్ ఉండాలి.
* అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ), రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్ సర్వీస్‌మెన్‌లు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతరులు మాత్ర రూ. 100 చెల్లించాలి.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,500 నుంచి రూ. 81,100 వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 08-06-2022న మొదలై 07-07-2022తో ముగియనుంది.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..