IPPB Jobs 2025: ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో సర్కార్‌ కొలువులు

IPPB Executive Recruitment Notification 2025: ఏదైనా డిగ్రీ అర్హతతో తపాలా శాఖలో ఉద్యోగాలకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌ (IPPB).. అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద తెలుగు రాష్ట్రాల్లోనూ ఉద్యోగాలు..

IPPB Jobs 2025: ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో సర్కార్‌ కొలువులు
IPPB Executive Recruitment Notification

Updated on: Oct 10, 2025 | 11:14 AM

కేంద్ర తపాలా శాఖకు చెందిన ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌ (IPPB).. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 348 ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

రాష్ట్రాల పోస్టుల వివరాలు ఇవే..

  • తెలంగాణ రాష్ట్రంలో పోస్టుల సంఖ్య: 09
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోస్టుల సంఖ్య: 8
  • అస్సాం రాష్ట్రంలో పోస్టుల సంఖ్య: 12
  • బీహార్ రాష్ట్రంలో పోస్టుల సంఖ్య: 17
  • ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో పోస్టుల సంఖ్య: 9
  • గుజరాత్ రాష్ట్రంలో పోస్టుల సంఖ్య: 29
  • దాద్రా అండ్‌ నగర్ హవేలీ రాష్ట్రంలో పోస్టుల సంఖ్య: 1
  • హరియాణ రాష్ట్రంలో పోస్టుల సంఖ్య: 11
  • హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పోస్టుల సంఖ్య: 4
  • జమ్మూ అండ్ కశ్మీర్ రాష్ట్రంలో పోస్టుల సంఖ్య: 3
  • ఝార్ఖండ్‌ రాష్ట్రంలో పోస్టుల సంఖ్య: 12
  • కర్ణాటక రాష్ట్రంలో పోస్టుల సంఖ్య: 19
  • కేరళ రాష్ట్రంలో పోస్టుల సంఖ్య: 6
  • మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పోస్టుల సంఖ్య: 29

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 2025 ఆగస్టు 1వ తేదీ నాటికి 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్ 29, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద అభ్యర్ధులు తప్పనిసరిగా రూ.750 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, విద్వార్హతల్లో సాధించిన మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.30,000 జీతంతోపాటు ఇతర అలవెన్స్‌లు చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్లో చెక్‌ చేసుకోండి.

నోటిఫికేషణ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.