IOCL non-executives Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) దేశ వ్యాప్తంగా పలు కేంద్రాల్లో ఖాళీగా ఉన్న.. 56 ఇంజినీరింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అటెండెంట్ పోస్టుల (Assistant Engineer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మెకానికల్, ఎలక్ట్రికల్, గేడ్ 4, ఆపరేషన్స్ విభాగాల్లో ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు.. ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టులకైతే సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టెక్నికల్ అటెండెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు 10వ తరగతితోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 26 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 10, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ రూ.100లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాతపరీక్ష/స్కిల్‌టెస్ట్/ప్రొఫిషియన్సీ/ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.23,000ల నుంచి రూ.1,05,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.