Intermediate Exams: మార్చిలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్.. కీలక ప్రకటన చేసిన తెలంగాణ ఇంటర్ బోర్డ్..

Intermediate Exams: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌కి సంబంధించి తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్మీడియట్..

Intermediate Exams: మార్చిలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్.. కీలక ప్రకటన చేసిన తెలంగాణ ఇంటర్ బోర్డ్..
Practical Exams

Updated on: Feb 04, 2022 | 12:13 PM

Intermediate Exams: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌కి సంబంధించి తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మార్చిలో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. విద్యార్థుల కాలేజీల్లోనే ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని పేర్కొ్న్నారు. ఈ ఏడాది మొత్తం సిలబస్‌లో 70 శాతం ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించి, త్వరలోనే షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్టు తెలంగాణ స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ అధికారి తెలిపారు. కాగా, గతేడాది కరోనా కారణంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ విద్యార్థులకు హోమ్ వర్క్ అసైన్‌మెంట్స్ ప్రాక్టికల్‌గా ఇచ్చారు. ఇప్పుడు కరోనా ప్రభావం పెద్దగా లేకపోవడం, కాలేజీలో తిరిగి తెరుచుకోవడంతో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు అధికారులు చెప్పారు.

ఇదిలాఉంటే.. ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలలో అసైన్‌మెంట్ల ద్వారా విద్యార్థులకు మార్కులను అంచనా వేస్తారని అధికారులు తెలిపారు. విద్యార్థులకు అసైన్‌మెంట్‌లు ఇవ్వడం జరుగుతుందని, వాటిని ఇళ్ల వద్ద పూర్తి చేసి, కాలేజీల్లో సబ్‌మిట్ చేయాలన్నారు. ఇదిలాఉంటే.. మే లో పబ్లిక్ ఇగ్జామ్ నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. 70 శాతం సిలబస్ ఆధారంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక పరీక్ష పత్రంలోనూ కీలక మార్పులు ఉంటాయంటున్నారు. విద్యా్ర్థులకు ఎక్కువ ఆప్షనల్ ప్రశ్నలు ఉండేలా ప్రశ్న పత్రం రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

Also read:

Telangana Cancer: తెలంగాణలో పెరుగుతున్న క్యాన్సర్‌ కేసులు.. మూడేళ్లలో మరింత పెరిగే అవకాశం

NEET PG 2022 updates: నీట్ పీజీ 2022 6-8 వారాలపాటు వాయిదా! సుప్రీం తీర్పుకు ముందే కేంద్రం కీలక నిర్ణయం..

UP Assembly Election 2022: యూపీ ఎన్నికల ప్రచారంలో ఎదురుపడిన రెండు పార్టీల అగ్రనేతలు.. హాట్ హాట్ వీడియో..