
ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్‌ఏ).. షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్- జనవరి 2027 కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఇండియన్ నేవీ ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కోర్సులో ప్రవేశాలు 2027 జనవరి నుంచి ప్రారంభం అవుతాయి. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 260 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 24, 2026వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బీఎస్సీ, బీకాం, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు, వయోపరిమితి కలిగి ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 24, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హతల మార్కులు, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు కేరళలోని ఎజిమలలో ఉన్న ఇండియన్ నావల్ అకాడమీ (ఐఎన్‌ఏ) శిక్షణ ఇస్తారు. అనంతరం విధులు కేటాయిస్తారు. ఈ పోస్టుల ప్రారంభ వేతనం నెలకు రూ.1,25,000 నుంచి ప్రారంభమవుతుంది.
ఇండియన్ నేవీ ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.