Indian Navy Recruitment 2022: ఇండియన్‌ నావీలో 230 అప్రెంటిస్‌ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. పదో తరగతి అర్హత..

|

Sep 11, 2022 | 7:51 AM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ నేవీ (Indian Navy) కొచ్చిలోని నావెల్‌ షిప్‌ రిపైర్‌ యార్డ్‌, నావల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ యార్డ్‌లలో.. 230 అప్రెంటిస్‌ పోస్టు (Apprentice posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

Indian Navy Recruitment 2022: ఇండియన్‌ నావీలో 230 అప్రెంటిస్‌ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. పదో తరగతి అర్హత..
Indian Navy
Follow us on

Indian Navy Apprentice Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ నేవీ (Indian Navy) కొచ్చిలోని నావెల్‌ షిప్‌ రిపైర్‌ యార్డ్‌, నావల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ యార్డ్‌లలో.. 230 అప్రెంటిస్‌ పోస్టు (Apprentice posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌, ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌, ఫిట్టర్‌, మెషినిస్ట్‌, మెకానిక్‌ మోటర్‌ వెహికల్‌, మెకానిక్‌ రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండీషనింగ్‌, టర్నర్‌, వెల్డర్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌, షీట్‌ మెటల్‌ మెకానిక్‌, ప్లంబర్‌, మెకానిక్‌ డీజిల్‌, మెరైన్‌ ఇంజిన్‌ ఫిట్టర్‌, షిప్‌రైట్‌, పెయింటర్‌, పైప్‌ ఫిట్టర్‌, ఫౌండ్రీమెన్‌, టైలర్‌ తదితర ట్రేడుల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదోతరగతిలో కనీసం 50 శాతం మార్కులతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు 21 నుంచి 30 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 23, 2022వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవచ్చు. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

అడ్రస్: The Admiral Superintendent, Apprentie Training School, Naval Ship Repair Yard, Naval Base, Kochi-682004.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.