India Growth: భారత్‌లో భారీగా పెరగనున్న ఉద్యోగ నియామకాలు.. కీలక నివేదిక

|

Dec 11, 2024 | 5:27 PM

India Growth: జైపూర్, ఇండోర్, కోయంబత్తూర్ వంటి అభివృద్ధి చెందుతున్న నగరాలు టాలెంట్ హబ్‌లుగా మారుతున్నాయి. తాజా గ్రాడ్యుయేట్లు, మధ్య స్థాయి నిపుణులను ఎక్కువగా BFSI, తయారీ, IT రంగాలు ఆకర్షిస్తున్నాయని నివేదిక పేర్కొంది..

India Growth: భారత్‌లో భారీగా పెరగనున్న ఉద్యోగ నియామకాలు.. కీలక నివేదిక
Follow us on

ఇండియా డీకోడింగ్ జాబ్స్ రిపోర్ట్ 2025 కీలక విషయాలను వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగ నియమకాలు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇండియా డీకోడింగ్ జాబ్స్ రిపోర్ట్ ప్రకారం.. గత సంవత్సరంతో పోలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతీయ కంపెనీలు నియామక వృద్ధి 9.75% ఉండనుందని అంచనా చూస్తోంది. అకాడమీలో సగటున 3000 మంది ఉద్యోగులతో దేశవ్యాప్తంగా ఉన్న 200 ప్రముఖ కంపెనీల నివేదిక అందించింది. ఈ సంవత్సరం ఇండియా ఇంక్ 2025 వర్సెస్ FY2024లో సగటున 9.75% ఎక్కువ ప్రొఫెషనల్స్‌ని నియమించుకునే రంగాల్లో కంపెనీలతో సానుకూల సంకేతాలను చూపుతోంది. ఐటీ పరిశ్రమ ఇంకా పుంజుకోనప్పటికీ ఈ పెరుగుదల ఉందని టాగ్డ్ వ్యవస్థాపక సభ్యుడు, సీఈవో దేవాశిష్ శర్మ ETకి తెలిపారు. FY 2026 కోసం చాలా వరకు నియామకాలు (దాదాపు 76 శాతం) భర్తీ చేయబోతున్నాయని తెలిపింది. అయితే తాజా నియామకాలు కంపెనీలు ప్లాన్ చేసిన మొత్తం నియామకాల్లో కేవలం 24% మాత్రమే.

డిజిటల్, సైబర్ సెక్యూరిటీలో అధిక డిమాండ్‌:

గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (జిసిసిలు), కోర్ సెక్టార్, ఇంజినీరింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, బీఎఫ్‌ఎస్‌ఐల ద్వారా నియామకాల వృద్ధిని చూడవచ్చని తెలిపింది. పరిశ్రమలలో 30% పైగా నియామకాలు భారతదేశంలోని టైర్ 2, 3 నగరాల్లో జరుగుతున్నాయి. పరిశ్రమలలోని 10 మంది యజమానులలో ఆరుగురు టైర్ 2, టైర్ 3 నగరాలు రాబోయే సంవత్సరంలో తమ టాలెంట్ అక్విజిషన్ ప్లాన్‌లో భాగమని శర్మ పేర్కొన్నారు. అన్ని పరిశ్రమలలో డిజిటల్, సైబర్ సెక్యూరిటీలో అధిక డిమాండ్‌ ఉంది.

దేశంలో 1,600 గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు:

ప్రస్తుతం భారతదేశంలో 1.66 మిలియన్ల మంది నిపుణులు పనిచేస్తున్న 1,600 గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (GCC)లు ఉన్నాయి. ఇది 2025లో 36% వరకు వృద్ధి ఉంటుందని అంచనా వేశారు. ఫలితంగా ఈ GCCల ద్వారా నియామకాలు ఉన్నాయని, వీటిలో ఎక్కువ భాగం కొత్త నియామకాలేనని చెబుతుననారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో 12% పెరిగే అవకాశం ఉందని సీఈవో దేవాశిష్ శర్మ అన్నారు.

BFSI, GCC కంపెనీలు రెండూ గత సంవత్సరం కంటే 12% ఎక్కువ నియామకాలు చేపట్టే అవకాశం ఉందని, ఆ తర్వాత 2025-26 ఆర్థిక సంవత్సరంలో 11.5% ఎక్కువ మందిని నియమించుకోవాలని చూస్తున్న కోర్ కంపెనీలు ఉన్నాయని నివేదిక చెబుతోంది. FMCG, ఫార్మాస్యూటికల్ కంపెనీలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో నియామకాలలో సంవత్సరానికి 10% వృద్ధిని చూస్తున్నాయి. ఆటో, ఐటీ కంపెనీలు వరుసగా 5.5%, 5% నియామకాలు ఉంటున్నాయి.

టాలెంట్‌ హబ్‌లుగా జైపూర్, ఇండోర్, కోయంబత్తూర్:

ఇదిలా ఉంటే.. జైపూర్, ఇండోర్, కోయంబత్తూర్ వంటి అభివృద్ధి చెందుతున్న నగరాలు టాలెంట్ హబ్‌లుగా మారుతున్నాయి. తాజా గ్రాడ్యుయేట్లు, మధ్య స్థాయి నిపుణులను ఎక్కువగా BFSI, తయారీ, IT రంగాలు ఆకర్షిస్తున్నాయని నివేదిక పేర్కొంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి