Indian Bank Recruitment 2022: రాత పరీక్షలేకుండా ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు పొందే అవకాశం.. పూర్తి వివరాలు ఇవే..

|

Aug 19, 2022 | 4:20 PM

భారత ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నైలోని ఇండియన్ బ్యాంక్ (Indian Bank).. ఒప్పంద ప్రాతిపదికన 11 ప్రొడక్ట్ ఓనర్‌ పోస్టుల (Product Owner Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు

Indian Bank Recruitment 2022: రాత పరీక్షలేకుండా ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు పొందే అవకాశం.. పూర్తి వివరాలు ఇవే..
Indian Bank
Follow us on

Indian Bank Product Owner Recruitment 2022: భారత ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నైలోని ఇండియన్ బ్యాంక్ (Indian Bank).. ఒప్పంద ప్రాతిపదికన 11 ప్రొడక్ట్ ఓనర్‌ పోస్టుల (Product Owner Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రిటైల్, అగ్రికల్చర్‌, ఎంఎస్‌ఎంఈ, డిజిటల్ అస్సెట్స్‌, డిజిటల్ మార్కెటింగ్, అనలిటిక్స్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి ఐటీ, టెక్నాలజీ/అగ్రికల్చర్/కంప్యూటర్/సిస్టమ్ సైన్స్/మ్యాథమెటిక్స్/ఎకనామెట్రిక్స్/స్టాటిస్టిక్స్/డేటా అనలిటిక్స్ స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మేనేజ్‌మెంట్/మార్కెటింగ్‌ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 30 నుంచి 50 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 3, 2022వ తేదిలోపు పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు దరఖాస్తులను పంపవచ్చు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా రూ.1000లు దరఖాస్తు రుసుముగా చెల్లించవల్సి ఉంటుంది. గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.