IAF AFCAT 2022 result declared: భారత వైమానిక దళం (Indian Air Force) ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ 2022 ఫలితాలను బుధవారం (మార్చి 9)న విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ afcat.cdac.inలో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. కాగా ఈ ఏడాది IAF AFCAT 2022 పరీక్ష ఫిబ్రవరి 12, 13,14 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరిగింది. ఇక ఈ పరీక్షను భారత వైమానిక దళం, గ్రౌండ్ డ్యూటీ, ఫ్లయింగ్ బ్రాంచ్‌లో రిక్రూట్‌మెంట్ కోసం నిర్వహించింది. ఏఫ్‌సీఏటీ పరీక్షలో అర్హత సాధించిన వారు తదుపరి AFSB ప్రక్రియ కోసం 5 రోజులలోపు నమోదు చేసుకోవల్సి ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డ్ (AFSB) పరీక్ష అనేది మొదటి దశ పరీక్ష తర్వాత నిర్వహించే రెండవ దశ. ఈ దశలో అర్హత కలిగిన అభ్యర్థులు డెహ్రాడూన్ (1), మైసూరు (2), గాంధీనగర్ (3), వారణాసి (4), గౌహతి (5) ఎంపిక బోర్డులలో ఏదైనా ఒకదానిలో రిపోర్ట్ చేయడానికి కాల్ లెటర్ అందుకోవడం జరుగుతుంది.
IAF AFCAT 2022 ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..
Also Read: